AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల కేంద్రంలో…

1 min read

AAB NEWS:దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల కేంద్రంలో అడ్డాకుల మండల కాంగ్రెస్ పార్టీ, దళిత నాయకుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ కార్యదర్శి జి. మధుసూధన్ రెడ్డి (GMR) గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు పల్లెపగు ప్రశాంత్ గారు, వనపర్తి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బోయేజ్ గారు, అడ్డాకుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందూరు నాగిరెడ్డి గారు, అడ్డాకుల మండల ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు ఆంజనేయులు గారు మాట్లాడుతూ గతంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చిన కెసిఆర్ గారు దళితున్ని ముఖ్యమంత్రి చేయలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని భూమి ఇవ్వలేదు ఇప్పుడు కొత్తగా దళిత బంధు పేరిట మరోసారి దళితులను మోసగించేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దళిత బందును ఎన్నికల స్టంట్ లా కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని ఏక కాలంలో ఒకే సారి అమలు చేసి అర్హులైన ప్రతి కుటుంబానికి 10 లక్షలు అందజేయాలని తెరాస ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తదనంతరం జిఎంఆర్ గారు మాట్లాడుతూ కెసిఆర్ గారికి ఉప ఎన్నికలు ఉంటేనే పథకాలు గుర్తొస్తాయని తెలియజేశారు. కేవలం హుజురాబాద్ లో ఎన్నికలు ఉన్నందువల్లే అక్కడ దళిత బందు పథకాన్ని ప్రవేశ పెడుతున్నారని తెలిపారు. ఉప ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ కేసీఆర్ గారు వరాల జల్లులు కురిపిస్తున్నారు అని పేర్కొన్నారు. అదేవిధంగా మన దగ్గర కూడా ఉపఎన్నికలు వస్తే నియోజకవర్గంలో పెండింగ్ పనులు పూర్తి కావడమే కాక ఎన్నో పథకాలు నియోజకవర్గంలో అమలయ్యే అవకాశం ఉందని తెలిపారు. కావున నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే గారికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. మన దగ్గర కూడా ఉపఎన్నిక వస్తే మన నియోజకవర్గ దళితులకు దళిత బంధు, గొల్ల కురుమ సోదరులకు గొర్రెలు, ఎన్నో పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉన్నందున తక్షణమే ఎమ్మెల్యే గారు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు పల్లెపగు ప్రశాంత్ గారు, వనపర్తి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బోయేజ్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొండా జగదీశ్వర్ గారు, అడ్డాకుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందూరు నాగిరెడ్డి గారు, మూసాపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శెట్టి శేఖర్ గారు, టీపీసీసీ ఫిషర్మెన్ కార్యదర్శులు సంద వెంకటేష్ గారు, రాములు ముదిరాజ్ గారు, అడ్డాకుల మండల ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు ఆంజనేయులు గారు, దశరథ రెడ్డి గారు, వర్నే సర్పంచ్ బంగారయ్య గారు, నిజలాపూర్ ఎంపీటీసీ సిజి. గోవర్ధన్ గారు, అడ్డాకుల ఉప సర్పంచ్ గంగుల శ్రీనివాస్ రెడ్డి గారు, ముసాపేట్ మండల మైనార్టీ అధ్యక్షుడు ఖలీల్ గారు, కొమ్మిరెడ్డి పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిరంజన్ గారు, కందూర్ శ్రీహరి గారు, అడ్డాకుల ఖాజమైనద్దీన్ గారు, నిరంజన్ ఘోరీ గారు, హన్మంత్ గారు, శరత్ రెడ్డి గారు, ఉంద్యాల శేఖర్ గారు, అజయ్ గారు, మనోహర్ గారు, ప్రేమ్ గారు, వలుగుమాన్ శ్యామ్ గారు, రాములు గారు, రాములు యాదవ్ గారు, సాయిలు గారు తదితరులు పాల్గొన్నారు.

 131 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.