AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తేనెటీగల పెంపకం ద్వారా అధిక ఆదాయం …

1 min read

AABNEWS : తేనెటీగల పెంపకం ద్వారా అధిక ఆదాయం సమకూరుతుందని, యువత తేనెటీగల పెంపకం లో దృష్టి సారించి, శిక్షణ ద్వారా నైపుణ్యాలను పెంచుకుని, పరిశ్రమలు స్థాపించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఖాది మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ రాష్ట్ర డైరెక్టర్ శ్రీ వి చందూలాల్ అన్నారు. ఈరోజు గన్నవరం స్థానిక బి కే ఆర్ సేవా సంఘ కార్యాలయంలో భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మరియు ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్, బి కే ఆర్ సేవా సంఘం ల సంయుక్త ఆధ్వర్యంలో తేనెటీగల పెంపకం పై ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ ఎం. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ యువత పరిశ్రమలు స్థాపించి, నాణ్యమైన తేనెను వినియోగదారులకు అందించాలని సూచించారు. మరో అసిస్టెంట్ డైరెక్టర్ ఏ గణేష్ రావు వు మాట్లాడుతూ యువతకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ఐదు రోజులపాటు శిక్షణలో అవగాహన కల్పించి తేనె పెట్టెలను ఇస్తామని తెలిపారు. ఈ సభకు అధ్యక్షత వహించిన బి కే ఆర్ సేవా సంఘం చైర్ పర్సన్ శ్రీమతి కానూరి శేషు మాధవి మాట్లాడుతూ యువత నైపుణ్యాల పెంపు పై దృష్టి పెట్టాలన్నారు. ఇందుకోసం సంఘం ద్వారా యువతకు మహిళలకు అనేక రకాల శిక్షణా కార్యక్రమాలు చేపట్టామని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ శ్రీ ఆర్ ఎల్ ఎన్ మూర్తి, శ్రీ సురేష్ బాబు, ట్రైనర్ టి, వెంకటేశ్వరరావు గార్లు పాల్గొన్నారు.

 174 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.