AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తమిళనాడులో ‘ఓలా’ ఈ-స్కూటర్…

1 min read

AAB NEWS : చెన్నై : క్యాబ్ సేవల సంస్థ ఓలా తమిళనాడులో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-స్కూటర్ ఫ్యాక్టరీని తమిళనాడులో నెలకొల్పేందుకు ఆ రాష్ర్ట ప్రభుత్వం ఓలా సంస్థ సోమవారం ఎంవోయూ కుదుర్చుకుంది. సంవత్సరానికి 20 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో రూ. 2,400 కోట్ల పెట్టుబడులతో ఈ ఫ్యాక్టరీని ఓలా నెలకొల్పనుంది. దీంతో 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తమిళనాడులో ఉత్పత్తి చేసే ఈ-స్కూటర్లను యూరోపియన్, లాటిన్ అమెరికన్, ఆసియా దేశాలకు సరఫరా చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ-స్కూటర్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనున్నట్లు ఓలా సంస్థ ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-స్కూటర్ ఫ్యాక్టరీని తమిళనాడులో నెలకొల్పుతున్నామని ప్రకటించడానికి సంతోషిస్తున్నట్లు ఓలా సంస్థ తెలిపింది.

 226 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.