AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అఖిల్‌ సార్థక్ఇప్పుడు కథానాయకుడిగా ‘ఫస్ట్‌ టైమ్‌’…‌

1 min read

AABNEWS : బుల్లితెర వేదికగా ప్రసారమయ్యే ఓ రియాల్టీ షోతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు నటుడు అఖిల్‌ సార్థక్‌. గతంలో పలు ధారావాహికల్లో నటించిన అఖిల్‌.. ఇప్పుడు కథానాయకుడిగా వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఫస్ట్‌ టైమ్‌’. విభిన్న కథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి హేమంత్‌ దర్శకుడుగానే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ని చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజాగా అఖిల్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా రియాల్టీ షో నుంచి రన్నరప్‌గా బయటకు వచ్చిన తర్వాత తనకి ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చాయని తెలిపారు. సుమారు 26 కథలు విన్నానని.. నచ్చకపోవడంతో రిజెక్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. ‘ఫస్ట్‌ టైమ్‌’ కథ తనకి ఎంతో నచ్చిందని.. ఈ సినిమాలో ఎన్నో విశేషాలున్నాయని, స్క్రిప్ట్‌ విన్న వెంటనే ఓకే చెప్పేశానని అఖిల్‌ వివరించారు.

 1,462 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.