ఈ ఏడాది వీళ్ల గురించే ఎక్కువగా వెతికారు…
1 min read
AAB NEWS : సెలబ్రిటీల గురించి ఏం కావాలన్నా సెర్చ్ ఇంజిన్లో శోధిస్తాం. వారి సినిమాలు, వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు.. ఎలాంటి సమాచారం కావాలన్న.. గూగుల్, యాహూలను ఆశ్రయిస్తాం. మరి ఈ ఏడాది ఎక్కువ మంది వెతికిన జాబితాను యాహూ ప్రకటించింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ గురించే ఎక్కువ మంది శోధించారని యాహూ తెలిపింది. ఆయన తర్వాతి స్థానంలో ప్రధాని మోదీ ఉన్నారు. ఇక సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మూడో స్థానంలో నిలిచింది. ఐతే 2017 నుంచి యాహూ మోస్ట్ సెర్చ్డ్ పర్సన్స్ జాబితాలో ప్రధాని మోదీ టాప్లో కొనసాగుతున్నారు. కానీ ఈ ఏడాది ఆయన రెండో స్థానంలో.. సుశాంత్ సింగ్ మొదటి స్థానంలో ఉన్నారు. సుశాంత్ సింగ్ మరణం యావత్ దేశాన్ని షేక్ చేసింది. ఈ క్రమంలోనే కోట్లాది మంది ఆయన గురించి, మరణం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించారు.
24 Total Views, 2 Views Today