AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఎక్కువ రోజులు ఆగేలా లేడుగా…

1 min read

AAB NEWS : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ ఏ పాటిదో తెలిసిందే. ఏ స్టార్ కైనా స్టార్ డం అనేది హిట్ ప్లాప్ ల పైన ఆధారపడి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అది వర్తించదు. 1996లో సినిమాల్లో అరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్ 2001 లో ఖుషీ వచ్చే వరకు వరుస హిట్లు సాధించి ఆకాశమంత స్టార్డమ్ సంపాదించాడు. ఖుషీ తరవాత పవన్ కళ్యాణ్ కి సరైన హిట్ పడలేదు. మధ్యలో జల్సా ఓ మోస్తారు హిట్టయిన అది పవన్ కళ్యాణ్ రేంజ్ కాదు. గబ్బర్ సింగ్ వచ్చేంతవరకు ఏకంగా 11 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ కి హిట్ లేదు. పవన్ కాకుండా ఇలా 11 ఏళ్ల పాటు హిట్లు లేకుంటే ఏ హీరో అయినా ఉండి ఉంటే ఈ పాటికి కనుమరుగయ్యేవాడు. కానీ పవన్ కళ్యాణ్ కు వరుసగా ఫ్లాప్ లు వచ్చినా ఆయన క్రేజ్ మాత్రం పెరుగుతూనే వచ్చింది. ఇప్పుడు జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ రెండేళ్ల పాటు సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్ళీ వరుసగా సినిమాలు అంగీకరిస్తూ నటిస్తున్నారు. అయితే పవన్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆయన తనయుడు అకిరా నందన్ హీరోగా ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా.. అని పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం అకిరా ఏజ్ 16 మాత్రమే. కానీ అకిరాను చూస్తే 16 ఏళ్ల టీనేజర్ అని ఎవరూ అనుకోరేమో. ఎందుకంటే అతడు ఈ వయసుకే 6.4 హైట్ పెరిగాడు. ప్రభాస్ రానా వరుణ్ తేజ్ కంటే అకిరా 2 ఇంచుల హైట్ ఎక్కువే ఉన్నాడు. అతడు హీరో గా ఎంట్రీ ఇస్తే పవన్ కళ్యాణ్ లెగసినీ కంటిన్యూ చేస్తాడని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకుంటున్నారు. మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యే అన్ని ప్లస్ పాయింట్స్ అకీరా లో కనిపిస్తున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ ఫోటోల్లో అకీరానందన్ హైట్ కి తగ్గ ఫిజిక్ తో ఆకట్టుకునేలా కనిపించాడు. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ తెగ సంబరం వ్యక్తం చేస్తున్నారు. అకిరా నందన్ తెలుగు లో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ఎన్నో రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని కామెంట్ చేస్తున్నారు. మరో మూడున్నర సంవత్సరాల్లో మళ్ళీ ఎన్నికలు ఉండడంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలు చేసి తిరిగి రాజకీయాల్లో బిజీ అయ్యే అవకాశం ఉంది. ఆలో గా పవన్ కళ్యాణ్ తన కొడుకును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.

 38 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.