ఎన్టీఆర్, త్రివిక్రమ్ ముగ్గురు సీనియర్ హీరోలతో…
1 min read
AABNEWS : త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న RRR తరవాత ఎన్టీఆర్ చేయబోయే చిత్రం ఇదే. ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనికి తోడు ఇంచుమించుగా ఆ సినిమాకు పనిచేసిన బృందమే ఈ చిత్రానికి పనిచేయనుంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే బోలెడన్ని రూమర్లు వచ్చాయి. అయితే, తాజాగా మరో క్రేజీ రూమర్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ముగ్గురు సీనియర్ హీరోలను త్రివిక్రమ్ చూపించబోతున్నట్టు టాక్. బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ సీనియర్ నటుడు జయరామ్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. రాజకీయం నేపథ్యంగా ఈ సినిమా ఉండబోతుందని.. సంజయ్ దత్ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు.ఉపేంద్ర, జయరామ్ పాత్రలు కూడా సినిమాకు చాలా కీలకం అని చెబుతున్నారు. అయితే, తమకంటూ ప్రత్యేక గుర్తింపు, ఇమేజ్ ఉన్న ఈ ముగ్గురు నటులు అంగీకరించారంటే కచ్చితంగా త్రివిక్రమ్ రాసుకున్న కథ అద్భుతంగా ఉంటుందని విమర్శకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందట. అందులో ఒక హీరోయిన్గా జాన్వీ కపూర్‌ను తీసుకుంటున్నారని టాక్.
152 Total Views, 2 Views Today