కంగనా బాగా మిస్సవుతుందంట…
1 min read
AAB NEWS :
బాలీవుడ్ నటి కంగనారనౌత్ నటిస్తోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తలైవి. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూట్ కోసం కంగనా గతవారం స్వస్థలం మనాలీ నుంచి హైదరాబాద్ కు వచ్చేసింది. మనాలీ నుంచి వచ్చినప్పటి తర్వాత కంగనా రనౌత్ బాగా వెలితిగా ఫీలవుతుందట. ఇంతకీ కంగనా ఏం మిస్సవతుందనే కదా మీ డౌటు. మనాలీలో చలికాలంలో కురిసే తొలకరి మంచు వర్షం అంటే కంగనాకు చాలా ఇష్టమట. అయితే ఈ సారి షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కు రావడంతో తొలకరి మంచులో ఆడుకునే సరదా క్షణాలకు దూరమైంది. మనాలీలో తొలకరి మంచుతో నిండిపోయిన తన ఇంటికి సంబంధించిన ఫొటోలను ట్విటర్ ద్వారా షేర్ చేసుకుంది.
ఇవాళ ఉదయం తొలకరి మంచులో మా ఇల్లు.. అని క్యాప్షన్ ఇచ్చింది. కొన్ని నెలలుగా మనాలీలోని ఇంట్లో ఉన్న కంగనా ఇటీవలే షూటింగ్ నిమిత్తం బయటకు వచ్చేసింది. తలైవి సినిమాతోపాటు ధాకడ్ సినిమా కోసం వర్కవుట్స్ కూడా షురూ చేసింది బాలీవుడ్ క్వీన్.
16 Total Views, 2 Views Today