AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కీలకమైన పాత్రలో జిషు సేన్ గుప్తా…

1 min read

AAB NEWS : నితిన్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘మాస్ట్రో’ సినిమా రూపొందింది. హిందీలో విజయం సాధించిన ‘అంధాదూన్’ సినిమాకి ఇది రీమేక్. నితిన్ సరసన నాయికగా నభా నటేశ్ నటించగా, హిందీలో ‘టబు’ చేసిన పాత్రలో తమన్నా కనిపించనుంది. ఇప్పటికే షూటింగును పూర్తిచేసుకున్న ఈ సినిమాను, త్వరలోనే విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను కొత్తగా ప్లాన్ చేశారట. అందులో భాగంగా .. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించిన వారందరిపై ఒక స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేశారు.ఈ స్పెషల్ సాంగ్ ను ఇటీవల హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో  ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. కేవలం ఈ ఒక్క పాట చిత్రీకరణ కోసం 50 లక్షలు ఖర్చు చేసినట్టుగా చెబుతున్నారు. ప్రమోషన్స్ సమయంలో ఈ పాటను వాడతారట. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, సాంగ్స్ పరంగా ఇప్పటికే మంచి మార్కులను కొట్టేసింది. బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించాడు. నితిన్ ఆశిస్తున్న హిట్ ఈ సినిమాతో పడుతుందేమో చూడాలి

 202 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.