గాజు ముక్క కూడా వేస్టే కానీ…
1 min read
AABNEWS : వైవిధ్య కథా చిత్రాలతో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ ఆంటోని. అయితే, తొలినాళ్లలో ఆయన సినిమాలు, కథల ఎంపికలో కనిపించిన విలక్షణత ఆ తర్వాత నెమ్మదిగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘విజయ రాఘవన్’. ఆనంద్ కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఐదు భాషల్లో ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో విజయ్ ట్యూషన్ మాస్టర్‌గా కనిపించనున్నారు. ‘గాజు ముక్క కూడా వేస్టే.. కానీ కంట్లో పడితే రక్తంగా మారుతుంది’ అంటూ విజయ్ గురించి విలన్ చెబుతున్న మాస్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
87 Total Views, 4 Views Today