AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గీతా ఆర్ట్స్ 2 పై లవ్ స్టోరీ త్వరలో సెట్స్ పైకి…

1 min read

AAB NEWS : రాహుల్ రవీంద్రన్ ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకి హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత ఆ స్థాయి పాత్రలు ఆయనకి లభించలేదు. దాంతో తనకి నచ్చిన ముఖ్యమైన పాత్రలను చేస్తూ ముందుకు వెళుతున్నాడు. మొదటి నుంచి దర్శకత్వం పట్ల కూడా ఆసక్తి ఉండటంతో మెగాఫోన్ పట్టేశాడు. అలా ఆయన తెరకెక్కించిన ‘చి..ల..సౌ’ సినిమాకి మంచి ఆదరణ లభించింది. నటుడిగానే కాదు దర్శకుడిగాను వరుస సినిమాలు చేయవచ్చని అంతా అనుకున్నారు. ఆ సమయంలోనే ఆయన ఆ తరువాత సినిమాగా ‘మన్మథుడు 2’ను రూపొందించాడు.

నాగార్జున కథనాయకుడిగా రాహుల్ తెరకెక్కించిన ‘మన్మథుడు 2’ పరాజయం పాలైంది. ఆ తరువాత రాహుల్ మరో మంచికథను తయారుచేసుకుని రంగంలోకి దిగాడు. గీతా ఆర్ట్స్ 2 వారికి ఆయన ఆ కథను వినిపించినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా గీతా ఆర్ట్స్ 2 వారు ఆయన కథను ఓకే చేశారట. దాంతో సెట్స్ పైకి వెళ్లడానికి రాహుల్ సన్నాహాలు చేసుకుంటున్నాడని అంటున్నారు. ఇది ఒక అందమైన ప్రేమకథ అట .. ఓ మాదిరి బడ్జెట్ తో రూపొందనుంది. మరి ఈ లవ్ స్టోరీలో నాయకానాయికలు ఎవరో .. ఈ కథతో రాహుల్ ఎంతవరకూ యూత్ ను మెప్పిస్తాడో చూడాలి.

 1,795 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.