February 24, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

చిట్టిబాబు సినిమా జెర్సీ డైరెక్టర్‌తో…

1 min read

AABNEWS : తెలుగు నాట మెగా పవర్ స్టార్ బిరుదును అందుకున్న ఎనర్జటిక్ హీరో రాంచరణ్‌. అభిమానుల్లో చెర్రీకి ఉన్న ఫాలోయింగ్ అంతఇంత కాదు. తన మొదటి సినిమా నుంచి ప్రత్యేక స్టైల్‌, డాన్సులతో ప్రతి సినిమాలో తన మార్క్ ఉంటుంది. ప్రస్తుతం రాంచరణ్ దర్శక ధీరుడు రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్నాడు. దాంతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమాలో కూడా కీలక పాత్ర చేయనున్నాడు. ఆచార్యలో చెర్రీ పరిచయం చాలా ఎమోషనల్‌గా ఉంటుందని దర్శకుడు కొరటాల శివ స్వయంగా తెలిపాడు. అయితే ప్రతి హీరో నుంచి వారి తదుపరి చిత్రాలపై అనేక వార్తలు వస్తున్నాయి. కానీ చెర్రీ నుంచి మాత్రం ఎటువంటి అప్‌డేట్ లేదు. ఇదే సమయంలో నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఈ సినిమాతో గౌతమ్ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం సినీ వర్గాల్లో రాంచరణ్ కొత్త సినిమాకు సంబంధించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. గౌతమ్ డైరెక్షన్‌లో చెర్రీ తన తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడని, గౌతమ్ చెప్పిన కథ నచ్చడంతో సినిమాకి ఓకే చెప్పాడని టాక్ నడుస్తోంది. ఈ సినిమా ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందనుందట, ప్రస్తుతం కథకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, అతి త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. 

 113 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.