AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

త్రిబుల్ ఆర్ మూవీకి అలియా గ్రహణం…

1 min read

AAB NEWS : ఏదో మోజు. బాలీవుడ్ పై ఉన్న వ్యామోహం.. కోట్లు కొల్లగొట్టాలి అనే కన్నింగ్ ప్లాన్స్. ఇవన్నీ బిజినెస్ లో కరెక్టే. అలియాని ఎందుకు తెస్తున్నారయ్యా.. ఆ మాత్రం బ్యూటీలు మన దగ్గర లేరా అంటే.. అంత స్టార్ ఉందా అంటారు. ఏం.. ఇన్నాళ్లూ రామ్ చరణ్ యాక్ట్ చేసిన హీరోయిన్లు యాక్టింగ్ లో ఎందుకు తక్కువా అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఉండదు. ఏమైనా అంటే.. మార్కెటింగ్ అంటారు. అలియా ఉంటే.. బాలీవుడ్ లో ఓపెనింగ్స్ అంటారు. మరి బాహుబలికి ఏ బాలీవుడ్ స్టార్ ఉన్నారు. అంతా.. తెలుగు స్టార్లే కదా. ఖండాంతరాలు దాటి పోయింది కదా ఖ్యాతి అంటే. అప్పుడంటే క్రేజ్ లేదు.. యాక్ట్ చేస్తారో లేదో తెలీదు. ఇప్పుడైతే.. వస్తారు.. అన్నీటికీ ఒప్పుకుంటారు. అందుకే.. కంఫర్ట్ అని తీసుకొచ్చుకుంటారు. అది సరెలే.. అలియా వచ్చినంత మాత్రాన మీకేంటి నష్టం. ఆమెకేం యాక్టింగ్ రాదా.. స్టార్ డమ్ లేదా అనొచ్చు. యాక్టింగ్ రావచ్చు.. స్టార్ డమ్ కూడా ఉండొచ్చు. కానీ.. అలియా అంటేనే ఇప్పుడు దరిద్రం. ఆ పిల్ల లెగ్గు.. ఐరన్ లెగ్గు లాంటిదే. ఆ మేడమ్ గారికి ఒంపులూ ఒయ్యారాలూ బానే ఉండొచ్చు కానీ.. యాక్టింగులో పెద్ద పీ హెచ్ డీ లు ఏం లేవు. పైగా.. దరిద్రం అంతా నెత్తిన చల్లుకుని కూర్చుంది. మూవీకి బ్యాడ్ టాక్.. వచ్చి.. డిస్ లైక్స్ పడి.. మేం చూడం మేం చూడం అన్నారనుకోండి.. త్రిబుల్ ఆర్ మూవీకి.. పాత కలెక్షన్లు కూడా రావు.
ఇంతకీ.. అలియా ఉంటే ఏంటి ప్రాబ్లమ్ అంటారా. ఉంది. సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు కదా. అప్పటి నుంచి.. నెపొటిజమ్ నెపొటిజమ్ అంటూ.. బాలీవుడ్ లో రచ్చ మొదలైంది. మన దాకా ఉన్నా.. ఇక్కడ తక్కువే కానీ.. అక్కడ మరీ డేంజర్. మన దగ్గరైతే.. నెపొటిజాన్ని జనాలే ఎంకరేజ్ చేస్తారు. ఈయన ఏ స్టార్ కొడుకు అని మేం చూడాలి అంటారు. బాలీవుడ్ లో అలా కాదు.. ఇప్పుడు స్టార్ కిడ్స్ కి ప్రాబ్లమ్ మొదలైంది. అలియా అయితే మరీ డేంజర్. సుశాంత్ సింగ్ సూసైడ్ టైంలో.. అలియా మూవీ టీజర్ రిలీజ్ అయితే.. లైక్స్ వన్ పర్సంట్ ఉంటే.. డిస్ లైక్స్ 99 పర్సంట్ ఉన్నాయి. తర్వాత సినిమా కూడా బిస్కెట్ అయింది. నెపొటిజానికి బ్రాండ్ అంబాసిడర్ అలియా అయిపోయింది. సుశాంత్ సింగ్ ఇష్యూలో కరణ్ జోహార్ క్రిమినల్ గా మారిపోయారు. ఆయనకేమో.. ఈమె ముద్దుల కిడ్డు. అందుకే.. అప్పట్లో అలియాని తిట్టి పోశారు. బయటికొస్తే జుట్టు పట్టి కొడదామని చూశారు కూడా. పోయి పోయి.. మన జక్కన్నేమో.. ఆమెతో కలిసి అయితేనే చెక్కుతా.. అని ఉలి పట్టుకుని కూర్చున్నాడు. ఇప్పుడైతే చల్లారింది. ఏమో.. ఇటు రామ్ చరణ్‌, ఎన్టీఆర్ లు కూడా స్టార్ ఫ్యామిలీలే. అంతా నెపో కిడ్సే అని.. బాయ్ కాట్ చేసినా చేస్తారు బాలీవుడ్ వాళ్లు. పైగా.. బాహుబలికి కరణ్ జోహార్ మంచి ఫ్రెండ్షిప్ ఇచ్చాడు. త్రిబుల్ ఆర్ కి కూడా రెడీ అంటాడు. కానీ.. కరణ్ జోహార్, అలియా భట్ లతో త్రిబుల్ ఆర్ మూవీకి.. పెద్ద గండమే ఉన్నట్లుంది.

 84 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.