థాంక్స్ తమ్ముడా…
1 min read
AAB NEWS : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఓ అదిరిపోయే గిఫ్టును పంపించాడట. దీనికి సంబంధించిన ఓ పోస్ట్‌ను ఆయన తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. అంతేకాదు అల్లు అర్జున్ ఈ రౌడీ విజయ్ కు స్పెషల్ థాంక్స్ కూడా చెప్పాడు. విజయ్ దేవరకొండకు తన స్పెషల్ డ్రెస్సింగ్ బ్రాండ్ ‘రౌడీ’ ఉన్న సంగతి తెలిసిందే. ఆ బ్రాండ్ నుంచి విజయ్ బన్నీకు గతంలోనే ఒక కలెక్షన్ ను పంపాడు. అలా ఇప్పుడు మరోసారి కొన్ని కూల్ డ్రెస్ కలెక్షన్ ను పంపాడు. దీనితో బట్టలు వేసుకొని మరింత స్టైలిష్ లుక్ లో కనిపించాడు అల్లు అర్జున్. ఇలాంటి స్పెషల్ థింగ్స్ ను తనకు పంపినందుకు తన బ్రదర్ విజయ్ కు అలాగే తన రౌడీ బ్రాండ్‌కు స్పెషల్ థాంక్స్ తెలుపుతున్నానని బన్నీ తన పోస్ట్‌లో పేర్కోన్నాడు. రౌడీ హీరో పంపిన స్పెషల్ కలెక్షన్ లో బన్నీ మరింత సూపర్ స్టైలిష్ గా ఉన్నాడని అంటున్నారు నెటిజన్స్. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురములో సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ చిత్రం ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరుగుతుండటంతో సినిమాలో చాలా వరకు క్యారెక్టర్స్ లో కొత్తవారు అయితేనే బాగుంటుందని సుకుమార్ భావించి.. ఆ పాత్రల్లో కొంతమంది కొత్త నటీనటులకు ట్రైనింగ్ ఇచ్చి తీసుకున్నాడు.
అడవి నేపథ్యంలో సాగుతుండడంతో ఈ సినిమాను చాలా వరకు కేరళ అడవుల్లో చిత్రీకరించాలనీ భావించారు దర్శక నిర్మాతలు. కానీ కరోనాతో ఆ ప్లాన్స్ అన్ని తారుమారు అయ్యాయి. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను విశాఖ పట్నం, తూర్పు గోదావరి మధ్యలో ఉన్న రంపచోడవంతో పాటు మన్యం అడవుల్లో ఈ సినిమాను షూట్ చేస్తున్నారు. అయితే టీమ్‌లో ఏవరికో ఒకరికి కరోనా వచ్చిందని టాక్. దీంతో షూటింగ్‌ను ఆపేసారని అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కొత్త లుక్‌లో పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్‌తో పాటు రష్మికతో పాటు పలువురు నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు సమాచారం. ఆ తర్వాత షెడ్యూల్‌ను చిత్తూరుతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని సత్య మంగళం అడవుల్లో కూడా ఈ సినిమా షూటింగ్‌ను ప్లాన్ చేసారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ వరకు పూర్తి చేసి మేలో సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.
84 Total Views, 6 Views Today