AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నన్ను వదిలేయండ్రా…

1 min read

AAB NEWS : నన్ను వదిలేయండ్రా అంటోన్న బండ్ల గణేశ్‌

తెలుగు ఇండస్ట్రీలో రాజకీయాలు ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి. ఆటు సినిమాలు..ఇటు రాజకీయాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొందరు రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. మరికొందరు రాజకీయాలు ఇక చాలు అనుకొని సినిమాలోనే కంటిన్యూ అవుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు మాత్రం అటు ఇటు చూస్తున్నారు. ఈయన భక్తుడు బండ్ల గణేష్ కూడా రాజకీయాల వైపు ఒక చూపు చూశాడు. 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరి నానా హంగామా చేశాడు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవకపోతే సెవన్ ఓ క్లాక్ బ్లేడ్ తీసుకొని గొంతు కోసుకుంటానంటూ మనోడు చేసిన కామెడీకి సోషల్ మీడియాలో పేలిపోయింది. ఇప్పటికీ బండ్ల గణేష్ అంటే సెవన్ ఓ క్లాక్ బ్లేడ్ అంటారు. అంత చెడ్డ పేరు తీసుకొచ్చింది ఈయనకు. దాంతో రాజకీయాలంటే పూర్తిగా భయపడుతున్నాడు బండ్ల గణేష్.

తనకు ఇలాంటి రాజకీయాలతో పని లేదని ఇకపై కేవలం సినిమాల్లో మాత్రమే నటిస్తాను అని క్లారిటీ ఇచ్చాడు. తనకు సినిమాలు తప్ప మరో లోకం లేదు..అనవసరంగా నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ చాలా సార్లు చెప్పాడు బండ్ల. అయినా కూడా ఈయన పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆగడం లేదు. ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ తో ఆడుకుంటారు నెటిజన్స్. ఇప్పుడు కూడా రాజకీయాలకు దూరంగా తన పని తాను చేసుకుంటూ ఉంటే మరోసారి ఈయనను టార్గెట్ చేశారు. త్వరలోనే ఆయన బిజెపిలో చేరబోతున్నాడు అంటూ ప్రచారం మొదలైంది. దాంతో వెంటనే సోషల్ మీడియాలో తన రాజకీయ భవిష్యత్తుపై స్పందించాడు గణేష్. అలాంటివేం లేవని..లేనిపోనివి సృష్టించి తనను ఇరకాటంలో పడేయొద్దు అంటున్నాడు బండ్ల గణేష్.

 70 Total Views,  6 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.