AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పుష్ప కు కాస్ట్‌లీ గర్ల్ ఫిక్స్…

1 min read

AABNEWS : అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప. దీనికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే సుకుమార్ తన మునపటి సినిమా రాంచరణ్ హీరోగా తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపేశాడు. మళ్లీ పుష్పలో కూడా ఒ ఐటెం సాంగ్ కోసం అందాల రాసి, ముద్దుగుమ్మల కోసం వేతుకుతున్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్ భామ దిశాపటానీని సంప్రదించాడు. కానీ ఈ అమ్మడు ఒక్క స్పెషల్ సాంగ్‌కి దాదాపు రూ.1.5కోట్ల పారితోషికం కోరింది. దాంతో అమ్మడికి ఓకే చెప్పాలా..వద్దా అని సుకుమార్ టీం చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. జిగేల్ రాణిని ఎలాగైనా మరిపించాలని సుకుమార్ బాలీవుడ్ కాస్ట్‌లీ గర్ల్‌ని బరిలోకి దించేస్తున్నాడు. అంతేకాకుండా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతుండటంతో బాలీవుడ్ బ్యూటీకి ప్రిఫరెన్స్ ఇచ్చాడు సుక్కు. దీంతో హిందీలో సినిమాకు బిజినెస్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రతి సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉండటం కామన్ అయింది. ప్రేక్షకులు కూడా ఐటెం సాంగ్‌ను చూడటానికి తెగ ఉబలాట పడిపోతున్నారు. అందుకనే దర్శకనిర్మాతలు సినిమాలో పక్కా ఓ ఐటెం సాంగ్‌ను ఉంచి ప్రేక్షకులను అలరిస్తున్నారు. మరి చూడాలి సుక్కు పుష్ప సినిమాతో ఎలాంటి రెస్పాన్స్ పొందుతాడో.

 99 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.