ఫైట్‌తో షూటింగ్ మొదలు…
1 min read
AAB NEWS : కరోనాతో ఏడెనిమిది నెలలు వాయిదా పడ్డ ఆచార్య చిత్ర షూటింగ్ నవంబర్ 9 నుండి తిరిగి ప్రారంభమైంది. ఆ సమయంలో చిరంజీవి కూడా జాయిన్ అవుతాడని మేకర్స్ ప్రకటించినప్పటికీ, కరోనా పరీక్షలలో పాజిటివ్‌గా రావడంతో కొద్ది రోజులు బ్రేక్ తీసుకున్నారు. అయితే నేటి నుండి ఆయన ఆచార్య షూటింగ్లో పాల్గొంటున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాలలో జరుగుతుండగా, ఫైట్ సీన్‌ను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
ఇటీవల తన భర్తతో హనీమూన్‌కు వెళ్లిన కాజల్ ఈ రెండు రోజులలో ఆచార్య చిత్ర బృందంతో కలవనుంది. ఇద్దరి మధ్య కీలక సన్నివేశాలని తెరకెక్కించనున్న కొరటాల సాంగ్స్ కోసం ఇతర రాష్ట్రాలకు వెళతాడని తెలుస్తుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
14 Total Views, 2 Views Today