September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బుల్లోడి ఖాతాలో సరైన హిట్ లేదు…

1 min read

AABNEWS : అక్కినేని బుల్లోడి ఖాతాలో సరైన హిట్ లేదు. అయినా చేస్తున్న, చేయబోతున్న సినిమాల బడ్జెట్ అమాంతంగా పెరిగిపోతున్నాయి. బడ్జెట్‌కి బిజినెస్‌కి సంబంధం లేకుండా సాగుతున్న వైనం. సినిమా కోసం ఎంతో కృషి చేస్తున్నా విజయం తనవైపు ఓరచూపు కూడా చూడటం లేదు. అక్కినేని అఖిల్‌కి ఇప్పటి వరకూ సరైన విజయం లేదు. నిజానికి నాగార్జున అఖిల్ కెరీర్ కోసం ఎంతో తాపత్రయపడుతున్నాడు. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లనే లైన్లో పెట్టాడు. అయినా ఎందుకో విజయలక్ష్మి మాత్రం వరించలేదు. టాలెంట్ ఉన్నా సక్సెస్ మాత్రం ముఖం చాటేస్తూనే ఉంది. ఇప్పుడు వరుస హిట్స్ ఇస్తున్న అల్లు అరవింద్ బ్యానర్‌లో సినిమా చేస్తున్నాడు అఖిల్. దాదాపు పూర్తయిన ఈ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది. ఈ సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ కంటే 20 శాతం పెరిగిందట. అంతే కాదు దీని తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోయే సినిమాకి 45 కోట్లకు పైగా బడ్జెట్ అవుతుందంటున్నారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం ‘అఖిల్’ బాక్సాఫీస్ వద్ద పేలి పోయింది. ఆ తర్వాత చేసిన ‘హలో’ లో సింగర్ గా అదనపు ప్రయోగం చేసినా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయాడు.

ఇక మూడోది ‘మిస్టర్ మజ్ను’ కూడా అఖిల్ ఆశ తీర్చలేక పోయింది. ఇప్పుడు ఆశలన్నీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ పైనే ఉన్నాయి. సక్సెస్ లేకపోయినా అఖిల్ పై 45 కోట్లు పెట్టడానికి నిర్మాత అనిల్ సుంకర రెడీ అవుతున్నాడు. అఖిల్ సినిమాకు 25 కోట్లకు మించి బిజినెస్ కాదు. అయినా రిస్క్ కి రెడీ అంటున్నాడు అనిల్ సుంకర. స్పై థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమా కోసం అఖిల్ గుర్రపు స్వారి కూడా నేర్చుకున్నాడు. సంక్రాంతికి రాబోతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ హిట్ అయితే తప్ప అఖిల్ సినిమా బిజినెస్ లెక్కలు మారవు. మరి అఖిల్ ఖాతాలో తొలి హిట్ పడుతుందా? అనిల్ సుంకర ధైర్యానికి ఊతం లభిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం వేచి చూడాల్సిందే.

 122 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.