AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

విక్టరీ వెంకటేష్‌ స్పీడ్…

1 min read

AAB NEWS : విక్టరీ వెంకటేష్ హీరోగా ‘నారప్ప’ అనే సినిమా తెరకెక్కుతున్నవిషయం తెలిసిందే. ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ అయిన ‘అసురన్’ సినిమాకు రీమేక్ . తమిళంలో ధనుష్ పోషించిన ఈ పాత్రను తెలుగులో వెంకటేష్ చేస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి నటిస్తుంది. మరో హీరోయిన్ గా మలయాళీ బ్యూటీ రెబ్బా మౌనిక ను ఎంపిక చేశారు. ఇక ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఫెమ్ శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ తమిళనాడు తిరుచందూర్ తెరికాడులోని రెడ్ డెసర్ట్ ప్రాంతంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఆతర్వాత కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. ఈ మూవీ తాజా షెడ్యూల్‌ వికారాబాద్‌ అడవుల్లో ప్రారంభమైంది. 15 రోజులు పాటు నాన్‌ స్టాప్‌గా ఈ షెడ్యూల్‌ కొనసాగనుంది. ఈ షెడ్యూల్‌లో వెంకటేష్‌తో పలు కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్‌ సీన్స్‌ తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది చివరి కల్లా సినిమా చిత్రీకరణ పూర్తి కానుండగా… వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది.

 34 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.