AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

విలన్‌గా మర్యాద రామన్న…

1 min read

AABNEWS : ఎన్టీఆర్ తన 30 సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వం లో చేస్తున్న విషయం తెలిసిందే . ఈ ప్రోజక్ట్ కు ‘అయినాను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ కెరియర్లో 30వ సినిమాగా వస్తున్న ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ అదిరిపోయే కథను సిద్ధం చేసాడని తెలుస్తుంది. దీనికి తోడు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌కు ఆయన స్టార్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఓ అదిరిపోయే క్యారెక్టర్‌ను రాసుకున్నాడట త్రివిక్రమ్. సంజయ్ దత్ ఈ సినిమాలో పక్కా రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడట.ఇక ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధాకష్ణ (చినబాబు) – నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.తారక్ ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కంప్లీట్ చేసిన వెంటనే త్రివిక్రమ్ ఈ సినిమాని స్టార్ట్ చేయనున్నాడు. అయితే.. ఈ సినిమా నుంచి ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో సునీల్‌ విలన్‌గా కనిపించనున్నాడట. అరవింద సమేతలో త్రివిక్రమ్‌ క్యారెక్టర్‌ ఇచ్చినా సునీల్‌ పెద్దగా క్లిక్‌ కాకపోవడంతో ఎలాగైనా తన ఫ్రెండ్‌కి మంచి బ్రేక్‌ ఇవ్వాలని ఈ సినిమాలో విలన్‌ రోల్‌ ఇస్తున్నాడట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌. 

 107 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.