September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

షూటింగు దశలో లక్ష్య…

1 min read

AABNEWS ;నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ‘లక్ష్య’ సినిమా నిర్మితమవుతోంది. భారీ బడ్జెట్ తో .. విలువిద్య నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ తో పాటు, డిఫరెంట్ లుక్ తో నాగశౌర్య కనిపించనున్నాడు. కరోనా కారణంగా షూటింగు ఆగిపోయిన సినిమాల్లో ఇది ఒకటి. ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఉండటం లేదనే టాక్ వచ్చింది.ఈ నేపథ్యంలో ఇక ప్రతి శుక్రవారం ఈ సినిమా నుంచి ఒక అప్ డేట్ ఇవ్వాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని నాగశౌర్య తెలియజేశాడు. ఇక నుంచి ప్రతి శుక్రవారం ఈ సినిమా నుంచి అప్ డేట్ ఉంటుందని స్పష్టం చేశాడు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా పోస్ట్ చేశాడు. కాలభైరవ అందించిన సంగీతం ఈ సినిమాకి అదనపు బలంగా నిలుస్తుందని అంటున్నారు.నాగశౌర్య సరసన నాయికగా కేతిక శర్మ నటిస్తున్న ఈ సినిమాలో, జగపతిబాబు కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాతో పాటు నాగశౌర్య వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ‘వరుడు కావలెను’ .. ‘పోలీస్ వారి హెచ్చరిక’తో పాటు సొంత బ్యానర్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలన్నీ కూడా సెట్స్ పైనే ఉన్నాయి.

 411 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.