AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సందడి చేసే మూవీస్ ఇవే…

1 min read

AABNEWS : తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి..ఈ పండుగ సినిమాలకి కూడా పెద్ద పండుగే అని చెప్పాలి. ప్రతి సంక్రాంతికి పెద్ద పెద్ద స్టార్స్ మూవీస్ రిలీజ్ కాావడం ఆనవాయితీగా వస్తోంది. మరి కరోనా వల్ల పరిస్థితులు తారు మారు అయ్యాయి. గత కొన్నేళ్లుగా ఒకేసారి మూడు నాలుగు పెద్ద సినిమాలను కూడా విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. పండక్కి ఆ స్కోప్ కూడా కనిపిస్తుంది. అయితే అప్పుడు పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. వచ్చే ఏడాది సంక్రాంతి పండగ కూడా హౌజ్ ఫుల్ అయిపోయింది. అరడజన్ సినిమాలు క్యూలో ఉన్నాయి. క్రేజీ హీరోలు తమ సినిమాలను పండక్కి విడుదల చేయాలని ఫిక్స్ అయిపోయారు. కరోనా కారణంగా 2020లో రావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. దాంతో 2021 తొలి పండగను అంతా టార్గెట్ చేసారు. ఎవరెవరు ఆ పండక్కి వస్తున్నారో చూద్దామా. మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ మూవీతో సందడి చేయనున్నాడు. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. జనవరి 14న క్రాక్ విడుదల కానుంది. ఇక ఎనర్జిటిక్ హీరో రామ్.. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రామ్ నటిస్తున్న మూవీ రెడ్ ఈ మూవీపై అం చనాలు భారీగానే ఉన్నాయి. తడమ్ రీమేక్ గా వస్తున్న రెడ్ జనవరి 13న విడుదల కానుంది.ఇకపోతే హీరో రానా దగ్గుబాటి హీరోగా తమిళ దర్శకుడు ప్రభు సాల్మాన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా జనవరి 10నే విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. మిస్టర్ మజ్ను లాంటి ఫ్లాప్ తర్వాత వెంకీ అట్లూరి.. భీష్మ లాంటి హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ కలిసి చేస్తున్న సినిమా రంగ్ దే. ఈ సినిమాను కూడా సంక్రాంతికే విడుదల చేస్తామని చెప్పారు నిర్మాతలు. ఇక అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్నది. తమిళ స్టార్ హీరో విజయ్ ఫాలోయింగ్ తెలుగులో కూడా బ్రహ్మాండంగా ఉంది. అందుకే మాస్టర్ సినిమాకు ఇక్కడ కూడా భారీ మార్కెట్ ఉంది. జనవరి 14న మాస్టర్ తెలుగు, తమిళంలో విడుదల కానుంది.

 78 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.