AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

6 మిలియన్ల క్లబ్ లో చేరిన మహేశ్

1 min read

AAB NEWS : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకి ఉన్న క్రేజే వేరు..ఈ హీరోకి లేడీస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరుతో హిట్ కొట్టిన మహేశ్..సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నాడు. ఈ హీరో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటాడు..సినిమా విషయాలే కాదు పర్సనల్ విషయాలని షేర్ చేస్తుంటాడు ఈ ఆరడుగుల అందగాడు. ట్విట్టర్ ఫేస్ బుక్ ఇన్ స్టాగ్రామ్ లలో మహేష్ బాబు చాలా యాక్టీవ్ గా ఉంటాడు. తన సినిమాలకు సంబంధించిన విశేషాలు తన ఫ్యామిలీ ఫొటోలను అభిమానులతో పంచుకుంచూ ఉంటారు.

ఇన్ స్టాగ్రామ్ లో మహేష్ ఫాలోవర్స్ సంఖ్య 6 మిలియన్లు దాటింది. దీంతో ఈ న్యూస్ ని సూపర్ స్టార్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్‌లో 6 మిలియన్ క్లబ్ లో చేరాడు.అంటే ఇప్పుడు మహేష్ ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే వారి సంఖ్య అక్షరాలా 60 లక్షలు అన్నమాట. ట్విట్టర్లోను 10.9 మిలియన్ల ఫాలోవర్లతో దూసుకుపోతున్నాడు మహేష్‌. ట్విటర్‌లో దక్షిణాది నటులకు అంత ఎక్కువ ఫాలోవర్స్‌ లేరు. దాంతో మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ కుషీలో ఉన్నారు.

మహేశ్ బాబు మాత్రమే కాదు ఆయన భార్య నమ్రత కూడా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. కాగా మహేశ్ బాబుకి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ రికార్డ్ స్థాయిలో ఉన్నారు. మహేష్ బర్త్ డే.. ఆయన సినిమాలకు సంబంధించిన వేడుకల సమయంలో అభిమానులు సోషల్ మీడియాలో చేసే సందడితో రికార్డ్ స్థాయిలో ట్వీట్స్ నమోదవుతుంటాయి. ఫేస్ బుక్ లోనూ సూపర్ స్టార్ కి భారీ ఫాలోయింగ్ ఉంది. ఇక ట్విట్టర్ లో 10.9 మిలియన్ ఫాలోవర్స్ తో సౌత్ హీరోల్లోనే అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోగా మహేష్ రికార్డ్ సృష్టించాడు. తాజాగా మహేష్ మరో రికార్డ్ సొంతం చేసుకున్నాడు.

మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో మొదలు కానుంది. ఇటీవల చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలు కాగా, ఈ కార్యక్రమానికి నమ్రత, సితార ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్తో మహేశ్ ఓ సినిమాకు సంతకం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రాజమౌళి దర్శకత్వంలో కూడా మహేష్ ఓ సినిమా చేయనున్నాడని టాక్.

 32 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.