AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రాజకీయ పార్టీల మోసాలని గుర్తించనంత కాలం దళితులు పదే పదే మోసపోవాల్సిందే…

1 min read

AAB NEWS:రాజకీయ పార్టీల మోసాలను గుర్తించనంత కాలం దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల వారు పదే పదే వారి చేతుల్లో మోసానికి గురి అవుతూనే ఉంటారని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవీపియస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి పేర్కొన్నారు.కెవిపియస్ గుడివాడ కార్యదర్శి వేసపోగు యెషయ్యతో కలిసి తమిరిశలో మాల్యాద్రి గురువారం పర్యటించి అంకన్నగూడెం దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించారు. మా రాజశేఖరరెడ్డి, మా చంద్రబాబు, మా జగన్, మా నాని అని కలవరించినంత కాలం దళితుల జీవితాలు బాగుపడవనేందుకు ఉదాహరణే అంకన్నగూడెం సమస్య అన్నారు. 100 ఏళ్లకు పూర్వం ఏర్పడిన అంకన్నగూడెం నేడు కనుమరుగైందంటే ఈ కుగ్రామం చుట్టూ తవ్విన చేపల చేరువులేనన్నారు. చేరువులతో ఏర్పడిన కాలుష్యానికి తోడు జన జీవన ప్రరిస్తితులన్నీ చిన్నాభిన్నమై గూడెం వాసుల జీవితాలను కభళించాయన్నారు. మరికొన్ని రోజులు అక్కడే ఉంటే చావుతప్పదని గ్రామాన్ని, కష్టపడి కట్టుకున్న ఇళ్లను వదిలి ఒడ్డున పడ్డారన్నారు. సమస్యను గుర్తించ బట్టే గూడెం వాసులకు అధికారులు 2006 లో తమిరిశలో స్థలాలు ఇచ్చారన్నారు. వీటిని ఆనుకుని చుట్టూ మంచిగా పండే భూములకు తప్పుడు నివేదికలు సృష్టించి అక్రమంగా అనుమతులివ్వడమే కాకుండా పోలీసుల రక్షణలో చెరువులు తవ్వించడం, ఇప్పుడు వాటిల్లో నీరుపెట్టించే ప్రయత్నాలు చేస్తున్నారంటే అధికారులు, రాజకీయ నాయకులు, భూస్వాములు అందరూ కలిసే మరోసారి గూడెం వాసుల జీవితాలను కూల్చే కుట్రలు చేస్తున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో చెరువుల అనుమతులు, వైకాపా ప్రభుత్వంలో వాటిని సాగులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటే అన్ని పార్టీల భాగస్వామ్యం, మీరు నమ్మి ఓట్లువేసి గెలిపించిన నాయకుల ప్రోద్బలంతోనే జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని అంకన్నగూడెం వాసులే కాకుండా యావత్ ప్రజానీకం గమనించాలన్నారు. చెరువుల వలన ఒకసారి వీరి జీవితాలు రోడ్డునపడితే, మరోసారి కావాలనే వీరి జీవితాలను నాశనం చేయడం దుర్మార్గమన్నారు. బుద్దున్నవాడేవాడు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడరని, తప్పు తెలుసుకుని ఇళ్లస్థలాల చుట్టూ అక్రమంగా ఇచ్చిన చెరువుల అనుమతులు రద్దుచేయించాలని అధికారులు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీరంతా ఐక్యంగా ఉండి పోరాడాలని, మన జీవితాలకు ఎవరు చేటు తెస్తున్నారో గుర్తించి ఎన్నికల్లో బుద్ది చెప్పాలని గూడెం వాసులని కోరారు. ఈ సందర్భంగా మాల్యాద్రికి గూడెంవాసులు వినతి పత్రాన్ని ఇచ్చి పోరాటానికి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవీపియస్) మద్దతు కోరారు. ఈ కార్యక్రమంలో గూడెం పెద్దలు గంటా దాసు, చిన్నోడు, రుద్రపాటి ఏసోబు, తులిమిల్లి నీలావతి, సబ్బే సుగుణకుమారి, వల్లే సుందరం, నిర్మల, జంగం హేమంతరాణి తదితరులు పాల్గొన్నారు…..
గుడివాడ సంఘం కార్యాలయంలో మాలమహానాడు నాయకులు పంతగాని సురేష్ తో కలిసి మీడియాతో మాల్యాద్రి మాట్లాడారు.

 141 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.