AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వైఎస్సార్‌ కాపునేస్తం నిధుల విడుదల…

1 min read

AAB NEWS: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం రెండో ఏడాది నిధులు విడుదల చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్‌ మీట నొక్కి 3.27లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో రూ.490.86 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థికసాయం చేయనున్నట్లు వివరించారు. పాత బకాయిలకు కాపు నేస్తం నగదు జమ చేసుకోకూడదని బ్యాంకులకు సూచించామన్నారు. రెండేళ్లలో కాపునేస్తం ద్వారా రూ.982 కోట్ల జమ చేసినట్లు జగన్‌ తెలిపారు. ఈ పథకం ద్వారా కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన 45-60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15 వేల చొప్పున సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.

 1,408 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.