September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

విశాఖపట్నం పార్లమెంట్ జిల్లా మైనార్టీ మోర్చా ఆత్మీయ అభినందన సభలో…

1 min read

AAB NEWS:విశాఖపట్నం పార్లమెంట్ జిల్లా మైనార్టీ మోర్చా ఆత్మీయ అభినందన సభలో నూతనంగా నియమితులైన మైనార్టీ మోర్చా పార్లమెంట్ అధ్యక్షులు టి.ప్రదీప్ కుమార్ కు మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ నియామక ఉత్తర్వులు అందజేసి శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రవీంద్ర రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్, కాశీరాజు, వర జాకబ్, ఆల్బర్ట్ లు అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ మాట్లాడుతూ బీజేపీతోనే మైనార్టీల సమగ్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మైనార్టీలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రంలో మైనార్టీల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మైనార్టీ వర్గాల పై దాడులు పెరిగిపోతున్నాయని పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతున్నారని, కనీసం దాడులు చేసిన నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, నిందితులను అరెస్ట్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. భారత దేశంలో ఎంతో మందిని బలవంతపు మత మార్పిడులు చేసిన, దేశంలోని చాలా మంది భారతీయులను చంపిన టిప్పు సుల్తాన్ విగ్రహ నిర్మాణం చేస్తామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రయత్నిస్తుండడం, ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి గో చట్టాలు పాతవయ్యాయని అమలు చేయలేక పోతున్నామని ఆ చట్టాలను రద్దు చేయాలని అనడం ఇవి అన్నీ చూస్తుంటే వైఎస్సార్సీపీ మైనార్టీలకు ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను దుల్హన్ పథకం, మైనార్టీ సబ్ ప్లాన్, ఇస్లామిక్ బ్యాంకింగ్, మదర్సా బోర్డు వంటి వాగ్దానాలను నెరవేర్చకుండా మత ఘర్షణలను రెచ్చగొట్టి మైనార్టీలకు ఎదో చేస్తున్నామనే భ్రమను ఇస్తున్నదని మైనార్టీలు ఇప్పటికైనా మేలుకోవాలని బీజేపీ ఆధ్వర్యంలో మైనార్టీలు ప్రజా ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ రోజు రోజుకి మైనార్టీ సమస్యలు రాష్ట్రంలో పెరిగిపోతున్నాయని వాటిని మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ప్రజలలోకి తీసుకొని వెళ్ళి అధికార పార్టీ దురాగతాలను తెలియచేయాలని కోరారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీనే ప్రతిపక్ష పార్టీ హోదా నిర్వహిస్తుందని అన్నారు. రాష్ట్రంలో మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేయాలని కోరారు. రాష్ట్రంలో మైనార్టీలు బలంగా ఉన్నారని అయితే ఆ పార్టీ లేకపోతే ఈ పార్టీ రెండు కుటుంబ పార్టీలే పెత్తనం చెలాయిస్తున్నాయని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ మన భారతీయ జనతా పార్టీ ఒక్కటేనని మైనార్టీలు బీజేపీని బలపరచాలని కోరారు. నూతనంగా నియమితులైన ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకంతో బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ గారికి, జిల్లా అధ్యక్షులు రవీంద్రా రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమ అనంతరం 60 మంది మైనార్టీలు రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ గారి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఆర్.సుహాసిని, మోహన రావు, ఆల్బర్ట్, అబ్రహాం, మొహమ్మద్ అలీ, అబ్దుల్ ఆదిల్ తదితరులు పాల్గొన్నారు.

 398 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.