AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అంధుల పాఠశాలకు ఆదాల దంపతులు లక్ష విరాళం…

1 min read

AABNEWS : నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి దంపతులు నెల్లూరు లోని విశ్వభారతి అంధుల పాఠశాలకు లక్ష రూపాయల విరాళం అందజేశారు. తమ వివాహ దినోత్సవం సందర్భంగా లక్ష రూపాయల నగదును విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ద్వారా మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ తమ ముఖ్యమైన దినోత్సవాల్లో అంధుల పాఠశాలకు ఆదాల దంపతులు విరాళాలు అందజేస్తూ ఎంతో ప్రోత్సహిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదాల సతీమణి వింధ్యావళి తో ఫోనులో మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు. విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి మాట్లాడుతూ ఆదాల కుటుంబంలో ఏ ముఖ్యమైన సందర్భం వచ్చినా అంధుల పాఠశాలకు విరాళాలు అందజేయడం ఆనవాయితీగా ఉందని గుర్తు చేశారు. అందులో భాగంగానే వారి వివాహ దినోత్సవ సందర్భంగా లక్ష రూపాయల విరాళం అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, కోటేశ్వర్ రెడ్డి, పాముల హరి, ఇక్బాల్, అవినాష్, నరసింహారావు, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

 215 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.