AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎప్సీ బ్యాంక్ ముందుకు వచ్చింది…

1 min read

AABNEWS : కరోనా వేళ తమ ఖాతాదారులకు అండగా నిలిచేందుకు దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎప్సీ బ్యాంక్ ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా 19 నగరాల పరిధిలో మొబైల్ ఏటీఎంలను అందుబాటులోకి తెచ్చింది. అయితే, మీరు ఫేస్ మాస్క్ ధరించి, శానిటైజ్ చేసుకుంటేనే మనీ విత్ డ్రాయల్ చేసుకోగలరు.మొబైల్ ఏటీఎంల ఏర్పాటుకు సంబంధించి హెచ్డీఎప్సీ బ్యాంకు సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసింది. ఏటీఎం లోకేషన్ పేరు ఈ వీడియోలో వినిపిస్తుంది. ముంబై, చెన్నై, హైదరాబాద్, పుణె, లక్నో, ఢిల్లీ, లుధియానా తదితర నగరాల్లోని వివిధ ప్రాంతాల పేర్లు వచ్చాయి.కొవిడ్-19 ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ప్రత్యేకించి కంటైన్మెంట్ జోన్‌లో ఈ మొబైల్ ఏటీఎం ఏర్పాటు చేసింది హెచ్డీఎప్సీ బ్యాంక్. కంటైన్మెంట్ జోన్ పరిధిలోని ప్రజలు బయటకు వెళ్లడానికి పూర్తిగా ఆంక్షలు అమలులో ఉంటాయి.గతేడాది మార్చి-ఏప్రిల్ నెలల్లో కూడా మొబైల్ ఏటీఎం కేంద్రాలను హెచ్డీఎఫ్సీ బ్యాంకు నిర్వహించింది. ఈ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 14 వేల ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. స్థానిక అధికారులతో మాట్లాడిన తర్వాతే హెచ్డీఎప్సీ బ్యాంకు ఈ మొబైల్ ఏటీఎంను ఏర్పాటు చేస్తుంది. కొన్ని చోట్ల తాను నిర్ణయాలు తీసుకుంటుంది.మొబైల్ ఏటీఎం నడిపే వ్యాన్ ను బ్యాంకు పూర్తిగా శానిటైజ్ చేస్తుంది. అలాగే ఈ ఏటీఎంల నిర్వహణలో పాల్గొంటున్న సిబ్బంది సామాజిక దూరం పాటించడంలోనూ మాస్కులు ధరించి, శానిటైజ్ చేసుకోవడంలోనూ ముందు ఉంటారు. మాస్కులు ధరించిన వారికి మాత్రమే డబ్బులు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.మామూలు ఏటీఎంల్లో మాదిరిగా మొబైల్ ఏటీఎంలలోనూ డబ్బు అందుబాటులో ఉంటుంది. మొబైల్ ఏటీఎంల్లో రోజుకు 100-150 లావాదేవీల వరకు నిర్వహించొచ్చు. గతనెలతో ముగిసిన చివరి త్రైమాసికంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.8,434 కోట్ల నికర లాభం గడించింది.

 772 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.