AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని ఏర్పాటు చేయాలిఆమ్ఆద్మీ పార్టీ హరినాధ్…

1 min read

AABNEWS : మన రాష్ట్రంలో రోజురోజుకీ ఉధృతమవుతున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి అన్ని రాజకీయ పక్షాలు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంద‌ని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కొ ణతాల హరనాధ్ బాబు అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే , ఎం.పి అనకాపల్లిలో ఉన్న ఇతర రాజకీయ పక్షాలను కలుపుకొని తక్షణం ఆన్లైన్ ద్వారా ఒక జూమ్ సమావేశం గాని, జాగ్రత్తలతో కూడిన ఒక సాధారణ సమావేశం గాని తక్షణం ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యం పట్ల అధికార పార్టీకి ఎంత శ్రద్ధ ఉంటుందో, ప్రతిపక్ష పార్టీలకు కూడా అంతే బాధ్యత ఉంటుందన్నది పాలకులు గ్రహించాలి. ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో ప్రతిపక్ష పార్టీలకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉందని అధికారపార్టీ పెద్దలు ఇప్పటికైనా గుర్తెరగాలి. ప్రతిపక్ష పార్టీలను చులకన భావంతో చూడరాదని ఈ సందర్భం వారికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.అనకాపల్లి ప్రజలు వివిధ సమస్యలతో అడుగడుగునా ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో అఖిలపక్ష పార్టీలు ఎప్పటికప్పుడు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ, వాటి పరిష్కారానికి పోరాడుతున్న సంగతి కూడా విధితమే. ఇలాంటి విపత్కర సమయంలో అధికార పార్టీ వారు ప్రజా సమస్యలను గాలికొదిలేసి నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడం ఎంత మాత్రం సరికాదు. కాబట్టి అధికార పార్టీ నాయకులు ఇప్పటికైనా స్పందించి ప్రతిపక్షాలను కలుపుకొని ప్రజల ఇబ్బందులను త్వరితగతిన పరిష్కరించేందుకు త్వరగా ఒక ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తోంద‌న్నారు

 253 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.