అంగణ వాడి కార్యకర్తలకి తొలి టీకా…
1 min read
AABNEWS :
కోట మండలంలోని చిట్టెడు, కోట పి హెచ్ సెంటర్లలో టీకా కార్యక్రమాన్ని రాష్ట్ర వైసీపీ సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ముందుగా ఆయన వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. హెల్త్ వర్కర్ , అంగణ వాడి కార్యకర్తలకి తొలి టీకాను వైద్యులు వేశారు. అనంతరం వినోద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 332 కేంద్రాల్లో 3.87 లక్షల మందికి తొలిదశలో వ్యాక్సిన్ వేయనున్నారు. అందులో భాగంగా కోట మండలం లోని చిట్టెడు, కోట ప్రభుత్వ ఆసుపత్రిలలోవ్యాక్సిన్ను ప్రారంభించడం జరిగింది అని ఆయన తెలిపారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అదేశాలు మేరకు విజయవాడలోని గన్నవరం వ్యాక్సిన్ స్టోర్ నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్ను పంపిణీ చేశారు అని వెల్లడించారు. శనివారం ఉదయం నుంచి ఆయా కేంద్రాల వద్ద నిర్ణయించిన మేరకు ఆరోగ్యశాఖలో పనిచేసే (ఫ్రంట్లైన్ వర్కర్లు) అందరికీ వ్యాక్సిన్ వేయనున్నారు. ఒక్కోకేంద్రం వద్ద రోజుకు 100 మందికి చొప్పున మొత్తం రోజుకు 33,200 మందికి వ్యాక్సిన్ వేసేలా చర్యలు చేపట్టారు అని తెలిపారు మొదటి డోసు టీకా ప్రక్రియ సుమారు 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత 28 రోజులకు రెండో డోసు ఇస్తారు. ఇప్పటి వరకూ రాష్ట్రానికి 4.7 లక్షల కోవిషీల్డ్, 20 వేల కోవాక్సిన్ టీకా డోసులు వచ్చాయి. ప్రతి సెంటర్ వద్ద డాక్టర్ పర్యవేక్షణ ఉంటుంది. వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి సెంటర్లో ఆరుగురు సిబ్బంది పనిచేస్తారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎవరిలోనైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వారికి తక్షణమే వైద్యసేవలు అందించేందుకు ప్రతి బోధనాసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు అనీ, మొదటి విడతలో హెల్త్ వర్కర్ , అంగణ వాడి కార్యకర్తలకి ఆ తరువాత పోలీసులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తరువాత ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది తెలిపారు. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 2021, జనవరి 16వ తేదీ శనివారం ఉదయం 10.30 వ్యాక్సినేషన్ వర్చువల్ విధానం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆంద్రప్రదేశ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు అని వినోద్ రెడ్డి తెలిపారు, వ్యాక్సిన్ పంపిణీ ఖర్చంతా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలువే అని స్పష్టం చేశారు. కొన్ని నెలల నుంచి కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నామని, ఇప్పుడా ఆ సమయం వచ్చిందన్నారు. చాలా తక్కువ సమయంలోనే టీకా వచ్చిందని వెల్లడించారు. శాస్త్రవేత్తల కృషి వల్ల రెండు వ్యాక్సినేషన్ లు వచ్చాయని, రాత్రింబవళ్లు వ్యాక్సిన్ కోసం పని చేశారని చెప్పారు. వైద్యులు, వైద్య సిబ్బంది తొలి టీకాకు హక్కుదారులన్నారు. మొదటి టీకా తీసుకున్న తర్వాత..రెండో డోస్ ఎప్పుడు తీసుకోవాలనే సమాచారం వారి వారి ఫోన్ ల ద్వారా సమాచారం అందివ్వడం జరుగుతుందన్నారు. రెండు డోస్ లు తప్పనిసరిగా తీసుకోవాలని, మరిచిపోవద్దన్నారు.ఈ కార్యక్రమంలో కోట మండల తహశీల్దార్ రమాదేవి, ఎంపిడిఓ భవాని,వైద్యులు, వైద్య సిబ్బంది , అంగని వాడి కార్యకర్తలు,వైసిపి నేత షేక్ మొబిన్ బాషా తదితరులు ఉన్నారు.
189 Total Views, 2 Views Today