అనంతపురం పోలీసు హెడ్ క్వార్టర్స్ దర్గాలో ఘనంగా గ్యార్మీ వేడుకలు…
1 min readAAB NEWS : అనంతపురం పోలీసు హెడ్ క్వార్టర్స్ దర్గాలో ఘనంగా గ్యార్మీ వేడుకలు ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ… రెండు వేల మందికి అన్నదానం ముస్లిం సోదరుల పవిత్ర పర్వదినమైన గ్యార్మీ వేడుకలు శనివారం అనంతపురం పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో ని మహబూబ్ సుబహాని దర్గాలో జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS గారి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పోలీసు ముస్లిం సోదరులతో కలసి ఎస్పీ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం గ్యార్మీ వేడుకల్లో భాగంగా ఎస్పీ చేతుల మీదుగా పోలీసు ముస్లిం సోదరులకు సుమారు రెండు వేల మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఇ.నాగేంద్రుడు, రామకృష్ణ ప్రసాద్ , హనుమంతు ( ఏ.ఆర్ ) అనంతపురం డీఎస్పీ జి.వీర రాఘవరెడ్డి, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్‌నాథ్, జాఫర్ , సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్ , సరోజ, దర్గా కమిటీ సభ్యులు మసూద్ వలీ, నజీర్ , షాషావలి, ఖాదర్ బాషా, లింగమయ్య, నాగరాజు, పలువురు సి.ఐ లు, ఆర్ ఐ లు, ఎస్ ఐ లు, ఆర్ ఎస్ ఐ లు, జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది, ముస్లిం పెద్దలు, పోలీసు ముస్లిం సోదరులు, తదితరులు పాల్గొన్నారు
48 Total Views, 2 Views Today