September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మానటరింగ్ కమిటీ నియమించాలి…

1 min read

AAB NEWS : ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మానటరింగ్ కమిటీ నియమించాలి. ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకే హరి..దళిత,గిరిజనుల దాడులు అత్యాచారాలు,దౌర్జన్యాలు ఆగాలంటే వెంటనే ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ అండ్ మానటరింగ్ కమిటీని నియమించాలని దళిత,గిరిజన సంఘాల జేఏసీ ఆద్వర్యంలో నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సమావేశంలో పేర్కొన్నారు. జేఏసీ అధ్యక్షుడు సాకే హరి మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అనేక రూపాల్లో దాడులు,అత్యాచారాలు జరుగుతున్నాయని వీటికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వాపోయారు.దళిత ,గిరిజనులకు ప్రభుత్వ అధికారులకు సమస్యలు పరిష్కారానికి వారధిగా కొనసాగే విధంగా ఎస్సీ,ఎస్టీ విజిలన్స్ మానటరింగ్ నియమించాలని,దళిత,గిరిజన సంఘాల ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర,సామాజిక స్పృహ కలిగిన వారికి అవకాశం కల్పించాలన్నారు.కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఓ నల్లప్ప మాట్లాడుతూ..ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 207 కేసులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని పరిష్కారించి వారికి శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.దళిత సంక్షేమ సంఘం అధ్యక్షుడు నెరమెట్ల యల్లన్న మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో దళిత,గిరిజనులకు రక్షణ లేదని అనేక అవమానలకు గురౌతూ బతుకుతున్నారని,వారికి విముక్తి కలిగేల చూడాలని అన్నారు.మాలమహానాడు ఓబులేసు మాట్లాడుతూ..జిల్లా కలెక్టరు వెంటనే విజిలెన్స్ మానటరింగ్ కమిటి వేయాలని లేనిపక్షంలో ఉద్యమాలు చేస్తామన్నారు. కుల వివక్షత,అంటరానితనం అంటూ అవమానాలకు గురిచేస్తున్నారని దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. సమావేశంలో అప్పా అధ్యక్షుడు చిన్నఅంజినేయులు.ఎస్సీ,ఎస్టీ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు కుళ్లాయప్ప.ఎంఆర్పీస్ జిల్లా అధ్యక్షుడు మందల రమేశ్. మానవహక్కుల సంఘం అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్.ఎరికల సంక్షేమ సంఘం సాకే చిరంజీవి.గిరిజన సంక్షేమ సంఘం ధనుంజయనాయక్.జేఏసీ నాయకులు సింగంపల్లి కేశవ.పూలకుంట గోవిందు.కాగొళ్ళ ప్రసాద్.వీరాంజి.కేవి సుందరం.శీన హనుమప్ప తదితరులు పాల్గొన్నారు.

 118 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.