AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

దేశ వ్యాప్త బందులో సిపిఎం…

1 min read

AAB NEWS : రైతు సంఘాల పిలుపుమేరకు దేశ వ్యాప్త బందులో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నేడు ఆ పార్టీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి రెండవ రోడ్డు, నడిమి వంక, టవర్ క్లాక్ సెంటర్, వరకు కొనసాగింది. అక్కడే టిఫిన్ చేసి బైఠాయించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రాంభూపాల్, నగర కార్యదర్శి నాగేంద్రకుమార్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులకు పైగా ఢిల్లీలో పెద్దఎత్తున రైతులు వ్యవసాయ రంగంలో తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని పోరాడుతుంటే, పరిష్కరించాల్సిది పోయి కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని దీనికి నిరసనగా రైతు సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. అందులో భాగంగా అనంతపురంలో పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా షాప్ యజమానులు, ప్రజలు బందులో పాల్గొంటున్నారని, ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం ఆలోచించాలని, తక్షణమే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి చట్టాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామిరెడ్డి, గోపాల్, అంజి, ఐద్వా నాయకులు సావిత్రి, నగర నాయకురాలు చంద్రిక, పండ్లతోటల రైతు సంఘం నాయకులు శివారెడ్డి, సిపిఎం నగర నాయకులు ఆర్ వి నాయుడు, వెంకటనారాయణ, ప్రకాష్, నాగప్ప, వలి, మసూద్, నూరుల్లా, ముస్కిన్, బాలకృష్ణ, రామాంజనేయులు, కెవిపిఎస్ నాయకులు వెంకటేష్, రాజు ,జీవా, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్య చంద్ర, రిషికేశ్ రెడ్డి, రఫిక్, భవన నిర్మాణ సంఘం నాయకులు జిలాన్, ముత్యాలప్ప , మున్సిపల్ యూనియన్ నాయకులు నాగభూషణ, లక్ష్మీనారాయణ, నాగరాజు, ఆది ,వరలక్ష్మి, అంగన్వాడి యూనియన్ జమున, హమాలి యూనియన్ నాయకులు వన్నూరు స్వామి, నూర్ భాష, రామదాసు, ఆటో నాయకులు నాగరాజు, కుళ్లాయి ,పంచాయతీ వర్కర్స్ యూనియన్ శివప్రసాద్, మధు, అక్రమ్, తదితరులు పాల్గొన్నారు…

 100 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.