September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

దేశ వ్యాప్త బంద్ ఎస్క్ యూనివర్సిటీలో…

1 min read

AAB NEWS : దేశ వ్యాప్త బంద్ ఎస్క్ యూనివర్సిటీలో విజయవంతం
రైతుల వేషధారణలో ఉరివేసుకొని విద్యార్థి నాయకులు వినూత్న నిరసన
ఏఐఎస్ఎఫ్ ఎన్ ఎస్ యూ ఐ పార్లమెంటులో ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా రైతులు భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఏఐఎస్ఎఫ్ ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించి,,, రైతులకు శాపంగా మరీనా చట్టాలను రద్దు చేయాలని రైతు వేషధారణలో విద్యార్థి నాయకులు ఎస్కే ప్రధాన గేటు ముందు ఉరి వేసుకుని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది… ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కుల్లాయస్వామి ఎన్ ఎస్ యు ఐ విశ్వవిద్యాలయాల కన్వీనర్ పులి రాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గత కొన్ని రోజుల నుండి ఢిల్లీలో రైతులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.దేశానికి వెన్నెముక లాంటి రైతులను కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టే విధంగా కొత్త చట్టాలను పార్లమెంట్లో తీసుకోవడం జరిగింది. బిజెపి ప్రభుత్వం దేశాన్ని మొత్తం కూడా కార్పొరేట్ చేతిలో అప్పచెప్పే విదంగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీ నగరంలో చేరుకొని ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి రైతులకు శాపంగా మారిన 3చట్టాలను రద్దు చేయకపోతే ప్రజలందరూ కూడా తిరగబడి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు పునుకుంటారని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఇప్పటికే శాంతియుతంగా రైతులందరూ ఆందోళన చేస్తుంటే వాళ్ల సమస్యలు పరిష్కరించకుండా దేశానికి అన్నం పెట్టే రైతులను కేంద్ర ప్రభుత్వం వాటర్ క్యాను భాష్ప వాయువు పోలీసుల చేత రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మీరు ఎన్ని ఇబ్బందులు చేసిన మేం వెనక్కి తగ్గే పరిస్థితి లేదని దేశ వ్యాప్తంగా రైతులు ఢిల్లీలొనే ఆందోళన చేస్తున్నారు.తక్షణమే రైతు చట్టాలను ఉపసంహరించుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడుతమని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో ఐ ఎఐఎస్ఎఫ్ నాయకులు మధు నారాయణ స్వామి వంశీ సాయి వినోద్ సుధీర్ ఎన్ ఎస్ యు ఐ నాయకులు నాయకులు మల్లికార్జున చంద్ర తదితరులు పాల్గొన్నారు

 144 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.