AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పనికిమాలిన జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలి…

1 min read

AAB NEWS :అంబేద్కర్ గారి విగ్రహం ఎదుట అరగుండు కొట్టించుకుని నిరసన,
ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన,
(అనంతపురం జిల్లా సిటీ)
రాష్ట్రంలో ఇటీవల విడుదల చేసిన పనికిమాలిన జాబ్ క్యాలెండర్ ను రద్దుచేసి, కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని, సోమవారం నాడు నగరంలోని స్థానిక అంబేద్కర్ గారి విగ్రహం ఎదుట ఏఐఎస్ఎఫ్, ఎస్ ఎఫ్ ఐ, ఏ ఐ వై ఎఫ్, డివైఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో అరగుండు కొట్టించుకుని నిరసన వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్, డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శులు మనోహర్, సూర్య చంద్ర, సంతోష్,రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు, పదివేల ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేసి జాబ్ జాతర క్యాలెండర్ అని గొప్పలు పలకడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే అన్ని ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగతన నిర్మూలిస్తామని, కరువు జిల్లాలో నిరుద్యోగులు యొక్క వలసలను నిర్మూలిస్తామని గొప్పలు పలికి అధికారంలోకి వచ్చిన అనంతరం నిరుద్యోగులను గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు, రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు గతంలోనే ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం తెలపడం జరిగిందని, అలాంటిది పదివేల ఉద్యోగాలు మాత్రమే విడుదల చేస్తే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ ఉద్యోగాలు భర్తీ కావని,నిరుద్యోగుల జీవిత కాలం మొత్తం పుణ్యకాలంలో గడిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు, ప్రభుత్వ పాఠశాలలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 25వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ఈ జాబ్ క్యాలెండర్ లో డీఎస్సీ నోటిఫికేషన్ ఊసే లేకపోవడం చాలా బాధాకరమన్నారు, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన అనంతరం వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి సేవా గుణం తో ఏర్పాటుచేసి గౌరవ వేతనం కింద జీతాలు ఇస్తున్నామని చెప్పి నేడు ప్రభుత్వం విడుదల చేసిన మోసపూరిత ప్రకటనలో వాటిని కూడా ప్రభుత్వ ఉద్యోగాలు లెక్కలోకి చూపించడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు, గతంలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అన్నిటిని కార్పొరేషన్ కిందకు చేర్చి వాటిని మా ప్రభుత్వమే ఉద్యోగాలు కలపించిందని అనడం హాస్యాస్పదమన్నారు, ఈ జాబ్ క్యాలెండరే ఒక పనికిమాలిన జాబ్ క్యాలెండర్ అని ఇలాంటి పనికిమాలిన జాబ్ క్యాలెండర్ ను తక్షణం రద్దు చేసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు కొత్త జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయకపోతే వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు, అవసరమైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని ముట్టడిస్తామని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్, డివైఎఫ్ఐ, ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు ఆనంద్, బాలకృష్ణ, పరమేష్ విద్యార్థి యువజన నాయకులు శివ, అచ్యుత్ ప్రసాద్, నరసింహ, విజయ్, రాము, వినయ్ , ప్రవీణ్, వినోద్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు

 1,994 Total Views,  37 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.