పాపులమ్మ జ్ఞాపకార్థం ….
1 min read
AABNEWS : పట్నం గ్రామం, కదిరి మండలం, అనంతపురం జిల్లా, . మా ఊరియందు 800 సంవత్సరాల నాటి పురాతనమైన శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయము కలదు.ఇది చోళుల కాలం నాటిదని ప్రతీతి.
ఐతే మాకు ఆలయ సంప్రోక్షణ మరియూ కుంభాభిషేకము చేయాలని సంకల్పం కలిగింది. కావున మా సంకల్పాన్ని మన్నించి,ఈ సత్కార్యానికి వారి అమ్మ స్వర్గీయ శ్రీమతి నచ్చు పాపులమ్మ జ్ఞాపకార్థం తన వంతు గా కాంగ్రెస్ బిసి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నచ్చు బాలకృష్ణ యాదవ్ రు. 5,116/- ( ఐదు వేల నూట పదహారు రూపాయలు) విరాళం ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజలు కూడా ధనసహాయం చేయ ప్రార్థన. ఈ సంప్రోక్షణను విజయవంతం చేసి మనం అందరం స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు
99 Total Views, 2 Views Today