AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పెళ్లి పెద్దగా రోబో…

1 min read

AABNEWS : పెళ్లి మామూలుగా జరగలేదు. గ్రాండ్‌గా ఏర్పాట్లు.. పసందుగా భోజనాలు.. లైటింగ్.. పూల డెకరేషన్లు చేశారు. ఇవి సరిపోవని అనుకున్నారేమో.. ఏకంగా పెళ్లి పెద్దగా ఓ రోబోను తీసుకువచ్చారు. రోబో చేసిన సందడి చూసి పెళ్లికి వచ్చిన వారంతా ఆశ్చర్యపోయారు. వింతగా ఉన్నా.. ఆనందపడ్డారు. అతిథులకు పూల బోకేలు ఇచ్చి స్వాగతం చెప్పింది. వధూవరులను పెళ్లి మండపానికి తీసుకువెళ్లింది. ఒకటేమిటి.. సకల మర్యాదలు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇంత చేసినా రోబో నిబంధనలు మరిచిపోలేదు. మాస్క్ పెట్టుకునే అన్ని పనులు చేసింది. అనంతపురం నగరంలో ఓ ప్రముఖ వ్యక్తి ఈ పెళ్లి వేడుకలు చేశారు. ఈ పెళ్లిలో రోబో సందడి చేసింది. బంధువులను ఆహ్వానించడం దగ్గరనుంచి వధూవరులను స్టేజ్‌పైకి తీసుకువెళ్లడం వరకు అన్ని పనులు చేసింది.

 328 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.