ప్రతిఘటన ర్యాలీ
1 min read
AABNEWS : అనంతపురం జిల్లా : పెనుకొండ నియోజకవర్గం, పెనుకొండ పట్టణములో టిడిపి ఎస్ సి సెల్ అధ్యక్షులు నరసింహులు ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు దళిత ప్రతిఘటన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి జిల్లా ఎస్ సి సెల్ అధ్యక్షులు నరసింహులు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దళితుల పట్ల ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్య వైఖరి వీడాలని, పులివెందులలో తెలుగుదేశం పార్టీ నాయకులపైన ఎస్ సి, ఎస్ టి కేసులు బనాయించారని తెలిపారు. ఈ కక్ష సాధింపు చర్యలను ఆపాలని, దళితుల పట్ల వివక్ష తగదని అన్నారు. తరువాత సబ్ కలెక్టర్ గారి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ, మాధవనాయుడు, శశిభూషణ్, ఎస్ సి సెల్ జిల్లా కార్యదర్శి బూదిలి లక్ష్మీపతి, మాజీ ఎమ్ పి పి వెంకటేష్, మాజీ సర్పంచ్ సూరి, మాజీ ఎమ్ పి టి సి క్రిస్టప్ప, చిలకల రామాంజనేయులు, కోనాపురం కొల్లప్ప, కన్వీనర్ శ్రీరాములు, మాజీ వైస్ ఎంపీపీ సిద్దయ్య, టౌన్ కన్వీనర్ హుజూర్, నరహరి, కన్నా స్వామి, అత్తర్ ఖాదీర్, త్రివేంద్ర నాయుడు, సుబ్బి మరియు దళిత సంఘం, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.
111 Total Views, 2 Views Today