భారత్ బంద్ ను జయప్రదం చేయండి…
1 min read
AAB NEWS : భారత్ బంద్ ను జయప్రదం చేయండి విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి రైతుల బంద్ కి మద్దతు తెలిపిన ఏఐఎస్ఎఫ్, ఎస్ ఎఫ్ ఐ, ఏ ఐ వై ఎఫ్, డివైఎఫ్ఐ, విద్యార్థి యువజన సంఘాలు రైతుల ఆందోళనకు సంఘీభావంగా ఈ నెల 8న జరుగుతున్న భారత్ బంద్ కు మద్దతు ప్రకటిస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏ ఐ వై ఎఫ్, డివైఎఫ్ఐ, వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నాడు నీలం రాజశేఖర్ రెడ్డి భవనం నందు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏ ఐ వై ఎఫ్, డి వై ఎఫ్ ఐ, జిల్లా ప్రధాన కార్యదర్శులు మనోహర్, సూర్య చంద్ర, సంతోష్, బాలకృష్ణ లు మాట్లాడుతూ రైతాంగ అభివృద్ధి కి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు, అందులో భాగంగానే ఈనెల 8న జరుగుతున్న భారత్ బంద్ కు జిల్లాలో విద్యార్థి, యువజన సంఘాలుగా మద్దతు తెలుపుతున్నామని ఈ బందుకు జిల్లాలోని విద్యార్థులు, యువత, విద్యాసంస్థలు సహకరించి బందును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు, దేశ అభివృద్ధికి వెన్నెముక లాంటి రైతాంగాన్ని కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టే దిశగా మోడీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తెచ్చిందని అన్నారు, తీవ్రమైన చలి లో దేశ రాజధానిలో రైతుల ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని ప్రదర్శించడం చాలా బాధాకరమన్నారు, చర్చలతో కాలయాపన చేయడం తప్ప కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు, రైతులు చేస్తున్న న్యాయమైన పోరాటాలకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంఘీభావంగా ప్రకటిస్తున్నారని తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి యేతర పార్టీలు మినహా అధికార మరియు ప్రతిపక్ష పార్టీలన్నీ బందుకు సంఘీభావాన్ని ప్రకటించారు కానీ మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు వారి స్వార్ధ రాజకీయాల లో మునిగి తేలుతున్నాయి అని అన్నారు, రైతుల ఓట్ల కోసం తాపత్రయం తప్ప వారి సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు మరచిపోయాయి అని అన్నారు, ఇప్పటికైనా రాష్ట్రంలో అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు సైతం రైతుల పోరాటాలకు మద్దతు తెలిపి బంధు కు సంఘీభావం తెలపాలని, కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని లేనిపక్షంలో భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు శ్రీకారం చూడుతామని ప్రభుత్వాలను హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కుల్లాయి స్వామి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆనంద్, ఏఐఎస్ఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి రమణయ్య, నగర నాయకులు మోహన్, నారాయణస్వామి, ఏ ఐ వై ఎఫ్ విజయ్, ఎస్ఎఫ్ఐ రిషి, తదితర నాయకులు పాల్గొన్నారు
46 Total Views, 2 Views Today