రాష్ట్రంలో పాలన అంత రాజరిక …
1 min read
AAB NEWS : రాష్ట్రంలో పాలన అంత రాజరిక పాలన జరిగినట్లు ఉంది.ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి MLA లకు,MLC లకు ,MP లకు, మంత్రులకు అపాయింట్ మెంట్ ఇవ్వరు.జిల్లాలో కలెక్టర్ గారు ప్రజలకు ,ప్రజాసంఘాలకు,రాజకీయ పార్టీల నాయకులకు అపాయింట్ మెంట్ ఇవ్వరు..ఇది ఏమైనా రాజరిక మా..ప్రజాస్వామ్య మా..సమాధానం చెప్పాలి అని ప్రభుత్వం కు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది.జిల్లా లో అనేక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనేక సార్లు కలెక్టర్ అపాయింట్ మెంట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గా,అనంతపురం అర్బన్ MLA గా పోటీ చేసిన అభ్యర్థి గా అడిగితే కలవడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. మేము సమస్యలు పరిష్కరించాలని ఎవరిని అడగాలని, ప్రజాప్రతినిధులు కూడా ఈయన చర్యలు వల్ల విసిగి పోతున్నారు. ముక్యంగా జిల్లా అధికారులు అక్కడే బోజనాలను కూడా తెచ్చుకోవడం జరుగుతుంది, ఇలాంటి అధికారి ని గతంలో ఎపుడు చూడ లేదు అని చాంబర్ దగ్గర వాపోతున్నారు, ఆయన కు వ్యక్తి గత సహాయకులు కూడా పని చేయడానికి ఎవ్వరు సుముఖంగా లేరు అని మాట్లాడుతూ ఉన్నారు.
కేవలం ముఖ్యమంత్రి గారికి మాత్రమే జవాబు దారి గా పని చేస్తే సరిపోతుంది అనే బావము తో కలెక్టర్ గారు పని చేస్తూ.మిగిలిన వారికి దూరంగా ఉండటం జరుగుతుంది. ఇలా అయితే మేము ఎవరికి మా సమస్యలు చెప్పుకోవాలి అని ప్రజలు బాధను వ్యక్తం చేస్తున్నారు, తప్పని పరిస్థితుల్లో రాజకీయ పార్టీలను ప్రజలు కలిసి తమ సమస్యలను కలెక్టర్ గారి దృష్టి కి తీసుకుని పోవాలి అని అడగడం వాళ్ల రాజకీయ పార్టీల ప్రతినిధులు గా మేము వెళితే మాకు అవమానాలు తప్ప ఆయన దర్శనం లేదు. ఈ విషయం జిల్లా ప్రజాప్రతినిధులకు చెపితే వారు కూడా చేతులు ఎత్తేస్తున్నా రూ.ఇది రాష్ట్రంలో జగన్ పాలన వీరి పాలనలో అందరికీ సమస్యలు ఎదుర్కొంటున్నారు అని కాంగ్రెస్ పార్టీ ఈరోజు విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పోతుల నాగరాజు మరియు జిల్లా నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు జి.వాసు,రమేష్,కడియాల ప్రక్రుద్దీన్, కళ్యాణ్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.
50 Total Views, 2 Views Today