రైతు ఉద్యమానికి సంఘీభావంగా…
1 min read
AAB NEWS : రైతు ఉద్యమానికి సంఘీభావంగా ఈ నెల 8న జరిగే భారత్ బంద్ కు సిపిఎం పత్తి మద్దతు తెలియజేస్తూ బంద్‌ను జయప్రదం చేయాలని బైక్ ర్యాలీ నిర్వహించారు స్థానిక ప్రెస్ క్లబ్ నుండి టవర్ క్లాక్ సప్తగిరి సర్కిల్ మీదుగా గాంధీ బజార్ తాడిపత్రి బస్టాండ్ ఫిలప్ రోడ్డు మీదుగా శ్రీకంఠం సర్కిల్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా రైతు సంఘాల పిలుపు మేరకు ఈనెల 8వ తేదీన భారత్ బంద్ జరగబోతోంది. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావంగా అనేక రైతు సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు బంద్ కు పిలుపునిచ్చారు. అయితే రాష్ట్రంలో అధికారపార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ జనసేన పార్టీ లు మద్దతు ఇవ్వక పోవడాన్ని రైతు వ్యతిరేక పార్టీలుగా చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు ఈ చట్టాలు రైతులకే కాకుండా దేశ ప్రజలందరికీ వ్యతిరేకమైనవి.వ్యవసాయాన్ని మార్కెటింగ్,రిటైల్ వర్తకాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు ఉద్దేశించిన చట్టాలు ఇవి. నిత్యావసర వస్తువుల చట్టం సవరణ వలన ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతాయి. గ్రామీణ ప్రాంత ప్రజలే కాకుండా పట్టణ ప్రాంత ప్రజలపై కార్పొరేట్ దోపిడీ తీవ్రమవుతుంది. చిల్లర వర్తక రంగాన్ని కార్పొరేట్లు కైవసం చేసుకోవటం వలన పట్టణాల్లోని చిన్న వర్తకులు పూర్తిగా దెబ్బ తింటారు. మోడీ ప్రభుత్వం మొండిగా, నిరంకుశంగా రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చింది. రైతు ఉద్యమాన్ని అణిచి వేయడానికి ప్రయత్నిస్తున్నది. చర్చల్లో కూడా మొండిగా వ్యవహరిస్తోంది.ఇటువంటి తరుణంలో రైతుల ఉద్యమానికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. దేశానికి, పట్టణ ప్రజలకు పట్టెడన్నం పెట్టే రైతులకు మద్దతుగా నిలవడం పట్టణ ప్రజల బాధ్యత.సీపీఎం పార్టీ
బంద్ కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది.బంద్ లో ప్రజలు ,సానుభూతిపరులు,సీపీఎం కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు
52 Total Views, 2 Views Today