February 24, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రైతు సమస్యలపై లేపాక్షి లో…

1 min read

AAB NEWS : రైతు సమస్యలపై లేపాక్షి లో సిపిఐ నిరసన ర్యాలీ రోడ్ బైఠాయించిన రైతులు, సిపిఐ నాయకులు నాయకులను అరెస్టు చేసిన పోలీసులు లేపాక్షి, పంటల సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో మంగళవారం లేపాక్షి ప్రధాన రహదారిలో ఎడ్లబండ్లతో నిరసన ర్యాలీ నిర్వహించారు రైతు సమస్యలు పరిష్కరించాలి, పంటలు సాగు చేసి నష్టాలకు గురైన రైతన్నను ఆదుకోవాలని నినాదాలు చేస్తూ ప్రధాన రహదారిలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి హిందూపూర్ నియోజవర్గ వర్గం సహాయ కార్యదర్శి శివప్ప ఆధ్వర్యంలో జరిగిన రైతు నిరసన కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, నియోజకవర్గం సహాయ కార్యదర్శి దాదా పీర్ హిందూపురం పట్టణ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి చిలమత్తూరు మండల కార్యదర్శి గోవింద రెడ్డి రైతులు పాల్గొన్నారు జరిగిన కార్యక్రమంలో సిపిఐ నాయకులు మాట్లాడుతూ ఈ ఏడాది కురిసిన వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు తీవ్ర నష్టాల గురయ్యారని తెలిపారు ప్రభుత్వం వెంటనే ఎకరాకు పది వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఇదేవిధంగా 2018 సంవత్సరానికి సంబంధించిన పెండింగ్ నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను తీవ్రంగా నష్టాలకు గురి చేస్తున్నాయని రైతుల బాధపడితే ప్రభుత్వాలు నిలబడవు అన్న విషయాలు గుర్తుపెట్టుకోవాలని వారు సూచించారు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రోడ్డు బైఠాయించి నినాదాలు చేస్తున్న తరుణంలో పోలీసులు అక్కడికి చేరుకొని నిరసన చేస్తున్న సిపిఎం నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు తిరిగి సొంత పూచీకత్తుపై విడుదలయ్యారు

 22 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.