AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రోడ్ సేఫ్టీ ఏన్ఫోర్మెంట్ యాక్ట్ 2013 ప్రకారం రోడ్డు భద్రత …

1 min read

AABNEWS : అనంతపురం జిల్లాలోని పామిడి పట్టణంలో రోడ్ సేఫ్టీ ఏన్ఫోర్మెంట్ యాక్ట్ 2013 ప్రకారం రోడ్డు భద్రత వారోత్సవాల పై అవగాహన కార్యక్రమంను సోమవారం సీఐ శ్యామ్ రావు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దవడుగూరు సార్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు భద్రత వారోత్సవాలు జనవరి 18నుంచి ఫిబ్రవరి 17 వరకు కొనసాగుతాయన్నారు. ఈ వారోత్సవాలలో భాగంగా రోడ్లపై ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్, వాహనానికి సంబంధించిన రికార్డులు కలిగి ఉండి రోడ్లపై ప్రయాణించాలన్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాల పై ప్రయాణం చేయరాదన్నారు. కారు ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. వాహనచోదకులు భద్రత ప్రమాణాలు పాటించాలని అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. భద్రత ప్రమాణాలు పాటిస్తే కుటుంబం క్షేమంగా ఉంటుందని తెలిపారు. భద్రతా ప్రమాణాలు పాటించని యెడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ శ్యామ్ రావు తెలిపారు.

 202 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.