September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఈ నెల 17న చలో అమరావతి…

1 min read

AAB NEWS :విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఈనెల 17వ తేదీన ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగే చలో అమరావతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని. మంగళవారం నాడు స్థానిక నీలం రాజశేఖర్రెడ్డి భవనం నందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందడంతో నే చలో అమరావతి కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఇప్పటికైనా ఈ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
1) ఎస్ కే యు, జె ఎన్ టి యు అభివృద్ధికి సరిపడ నిధులు కేటాయించి, వీటిలో కాళీగా ఉన్న టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల ను భర్తీ చేయాలని,
2) సెంట్రల్ యూనివర్సిటీ కి నిధులు మంజూరు కై చొరవ చూపి, విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించి, నూతన భవన పనులను వెంటనే ప్రారంభించాలని,,
3) కరువు జిల్లాలో అన్ని తరగతుల విద్యార్థులకు ఫీజులను రద్దుచేసి, ఉచిత విద్యను అందించాలని,
4) కరువు జిల్లాలో కార్పోరేట్, పలు ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టి ప్రభుత్వ నిబంధనలు పాటించని వాటిపైన చర్యలు తీసుకోవాలని,
6) కరువు జిల్లాలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా పరిశ్రమలు స్థాపించాలని,
7) ఇంటర్మీడియట్ నుండి పీ.జీ వరకు మొదటి విద్యా సంవత్సరము అడ్మిషన్లు నిర్వహించి తరగతులు ప్రారంభించి, ప్రభుత్వ వసతి గృహాల ను వెంటనే ప్రారంభించాలని,
8) ప్రభుత్వ విద్యా సంస్థలలో ఖాళీగా ఉన్న టీచింగ్- నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని,
9) టి టి సి లో చేరిన మేనేజ్మెంట్ మరియు స్పాట్ కోటా విద్యార్థులకు వెంటనే పరీక్షల షెడ్యూల్ను ప్రకటించాలని,
10) రాయలసీమలో హైకోర్టును వెంటనే ఏర్పాటు చేసి, అమరావతి లోనే రాజధానిని కొనసాగించాలని
ఈ కార్యక్రమానికి జిల్లాలోని విద్యార్థులు తరలిరావాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమం అనంతరం కూడా విద్యారంగ సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తే భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలకు శ్రీకారం చుడు తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కుల్లాయి స్వామి, నగర ప్రధాన కార్యదర్శి రమణయ్య, ఎస్ కే యు అధ్యక్షుడు నరసింహ, నగర నాయకులు నారాయణస్వామి, వన్నూరు స్వామి, ఇలియాజ్, సాయి, నవీన్, అరుణ్ నాయక్, సాయి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

 254 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.