AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సామాజిక విప్లవ మహోపాధ్యాయుడు అంబెడ్కర్…

1 min read

AAB NEWS : సాకే నరేష్ బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్దంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సాకే నరేష్ మాట్లాడుతూ ప్రతి రాజ్యాంగం అప్పటి తరానికి సంబంధించిన అభిలాషను మాత్రమే ప్రతిబింబించగలదు. అంతే కానీ వంద సంవత్సరాల తర్వాత ఉండాల్సిన సమాజాన్ని అప్పటి రాజ్యాంగం నిర్వచించలేదు. ఆ ప్రాక్టికల్ కోణాన్ని అర్థం చేసుకోకపోతే అంబేడ్కర్‌ను అర్థం చేసుకోవడం కష్టం. ఆయన ఆలోచనా విధానాన్ని–ముఖ్యంగా పోలరైజ్డ్ పాలిటిక్స్‌ను, రిప్రజెంటేషన్ పాలిటిక్స్‌ను– ఆకళింపు చేసుకోకుంటే ఏ సైద్ధాంతికవాదమైనా సరే ఈ దేశంలో వీగిపోవలసిందే. అయినా సరే అలా కోరుకున్నాం అంటే, దానర్థం, ఇంప్రాక్టికల్‌గా అంబేడ్కర్ మొండియుద్ధానికి దిగి ఉత్తి చేతులతో అమరుడై ఈ రోజు వర్ధంతులకు మాత్రమే పరిమితం కావాలని కోరుకోవడం. ఆయన వర్ధంతులకు పరిమతమయ్యే మనిషి కాదు. ప్రతి దినం, మన దేశ రాజకీయాలను ప్రశ్నించాల్సిన ప్రజానీకానికి బీజం నాటిన నిఖార్సైన సాంఘిక విప్లవవాది!

అంబేడ్కర్‌ బ్రిటిష్ వైస్రాయ్‌ కౌన్సిల్‌లో మంత్రిగా పని చేశారు. నెహ్రూ కేబినెట్‌లో కూడా న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తూ, రాజ్యాంగ రూపకల్పనకు అంకితమయ్యారు. సంప్రదాయ మార్క్సిస్టులు రాజ్యాంగాన్ని రూపొందించడం ఒక పాపంగా భావిస్తారు. వ్యవస్థలో భాగం కావడాన్ని ఒక రాజీగా పరిగణిస్తారు. అంబేడ్కర్‌ను తమ ఆలోచనా విధానంలోకి అహ్వానించడం అంటే అదో తక్కువ స్థాయి రాజకీయాలను ప్రేరేపిస్తున్నట్లు వారు భావిస్తారు. ఇంకోవైపు జాతీయవాదులు అంబేడ్కర్‌ను రాజ్యాంగానికి మాత్రమే పరిమితం చేసి, రాజ్యాంగవాదిగానే పరిగణిస్తారు. ఆయన బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయలేదు కాబట్టి, స్వాతంత్ర్య యోధుడుగా కానీ, స్వతంత్ర దేశ నిర్మాణంలో రూపకర్తగా కానీ భావించరు. నిజానికి అంబేడ్కర్ ఎవరికీ, ఏదో ఒక అస్తిత్వానికి మాత్రమే చెందినవాడు కాదు. అందరివాడు. సమూల సాంఘిక ప్రక్షాళనవాది, ప్రతిఘటన యోధుడు, యథాతథవాదాన్ని కూలదోసిన ఆలోచనాకర్త. ఈ దేశ సామాజిక పరిస్థితులకు ఇంత వరకు ఎవరూ ఊహించని, అన్వయించని ఒక ఆలోచనా దృక్పథాన్ని సృష్టించిన మహోపాధ్యాయుడు, ఇక్కడి మౌలిక రాజకీయ నిర్మాణాన్ని చారిత్రక భౌతికవాదంతో విశ్లేషించిన తత్వవేత్త. వెరసి ఓ సాంఘిక విప్లవకారుడు అంబేడ్కర్!
అంబేద్కర్ చూపిన మార్గంలో అందరూ నడవాలని పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమంలో న్యాయ వాదులు రంగనాయకులు , గుజ్జల పోతలయ్య , SC, ST JAC చిన్న ఆంజనేయులు , జిల్లా అధ్యక్షుడు బీసీ సురేష్ , ఉపాధ్యక్షుడు రాజు , సహాయ కార్యదర్శి దేవేంద్ర ,నాగేంద్ర ,బాలక్రిష్ణ ,దాదు ,కార్తిక్ , సంతోష్ తదితరులు పాల్గొన్నారు .

 158 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.