AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కరోనా చికిత్సకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసి, సిబ్బందిని నియమించాలి అఖిలపక్షం…

1 min read

AABNEWS : అనకాపల్లిలో కరోనా చికిత్సకు ఆక్సిజన్ పడకలను పెంచాలని మరియు సి.టి.స్కాన్, వెంటిలేటర్ల ఆపరేట్ చేసేందుకు టెక్నీషియన్లు అవసరమైన డాక్టర్లను నియమించాలని కోరుతూ అఖిలపక్షం ,ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్ కనిశెట్టి సురేష్ బాబు అధ్వర్యంలో ఎన్‌.టి.ఆర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ అయిన డాక్టర్ శ్రావణ కుమార్ మరియు కోవిడ్ ఆసుపత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న అనకాపల్లి తహశీల్దార్లను కలసి వినతిని ఇచ్చారు. ఈ సందర్భంగా తె.దే.పా జిల్లా ఉపాధ్యక్షుడు మళ్ళ సురేంద్ర, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలకృష్ణ మరియు రైతు స్వరాజ్య వేదిక కో కన్వీనర్‌ గాడి.బాలు మరియు సామాజిక కార్యకర్త కర్రి రాఘవనాయుడులు మాట్లాడుతూ ఆక్సిజన్ పడకలను 250కి పెంచాలని త్వరలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అందుబాటులోనికి రానున్న తరుణంలో యుద్ద ప్రాతిపదికన 250 ఆక్సిజన్ పడకలకు పైపులైన్ తదితరాలకు అవసరమైన కార్యాచరణ చెయ్యాలని, వెంటిలేటర్లు మరియు సి.టి స్కానును అందబాటులోనికి తెచ్చేందుకు అవసరమైన వైద్య సిబ్బందిని నియమించాలని మరియు మెడాల్ ద్వారా గతంలో చేసే అన్ని రక్త పరీక్షలను అందుబాటులోనికి తేవాలని డిమాండ్ చేసారు. దీని ఫలితంగా ప్రజలకు ప్రైవేటు ఆసుపత్రుల నుండి లేబులలో దోపిడీ బారిన పడకుండా కాపాడిన వారు అవుతారని తెలిపారు. వెంటనే మా వినతిని జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి కార్యరూపంలోనికి తీసుకు రావాలని డిమాండ్ చేసారు.

 1,383 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.