AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కరోన రెండవ దశ ఉదృతి నేపథ్యంలో ఈరోజు స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయంలో ఫ్రంట్ లైన్ వారియర్సగా పనిచేస్తున్న 44 సానిటరీ సిబ్బందికి అనకాపల్లి శాసనసభ్యులు…

1 min read

AABNEWS : కరోన రెండవ దశ ఉదృతి నేపథ్యంలో ఈరోజు స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయంలో ఫ్రంట్ లైన్ వారియర్సగా పనిచేస్తున్న 44 సానిటరీ సిబ్బందికి అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాధ్ ఒక్కొక్కరికి 5,000/- రూపాయల చొప్పున అక్షరాల 2,20,000/- రూపాయలు ఆర్ధిక సహయాన్ని అందచేశారు. ఈ సందర్భంగా అమర్నాధ్ గారు మాట్లాడుతూ హాస్పిటల్ లో పనిచేస్తున్న 23 మంది సెక్యూరిటీ సిబ్బందికి కూడా ఒక్కొకరికి 3,000/- రూపాయల చొప్పున అక్షరాల 70,000/- రూపాయలు అందజేస్తున్నట్లుగా తెలియజేసారు. ఇలాంటి సమయంలో మా కష్టాలని,సేవలని గుర్తించి మాకు ఆర్ధిక సహాయం అందించిన గుడివాడ అమర్నాధ్ గారికి శానిటేషన్ సిబ్బంది మరియు సెక్యురిటి సిబ్బంది వారు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో జిక్కుల సీతారామారావు, తాసీల్ధార్ శ్రీనివాసరావు , వైకాపా పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామ రాజు, వైకాపా నాయకులు పీలా రాంబాబు, పలకా రవి మరియు ఎన్టీఆర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు

 1,088 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.