AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నూకాంబిక ఆలయంలో కోవిడ్ నిబంధనలతో చండీ హోమం వాయిదా పడిన బహిరంగ వేలం పాటలు…

1 min read

AABNEWS : శ్రీ నూకాంబికా అమ్మవారి దేవస్థానంలో లోక కళ్యాణార్థం ప్రజా శ్రేయస్సు కొరకు ప్రజలందరూ కోవిడ్-19 కరోనా వైరస్ బారి నుంచి కోలుకోవాలని కోరుతూ మంగళవారం అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో ఆలయ అధికారులు , అర్చకులు ఛండీ హోమం నిర్వహించారు.ఈ కార్యక్రమం పరోక్షంగా భక్తులు వీక్షించేందుకు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అమ్మవారి యూ-ట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు.అమ్మవారి కొత్త అమావాస్య జాతర నెల పండుగ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూలంకరణ , పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ సహాయ కమీషనర్ , కార్యనిర్వహణాధికారి బి.ఎల్.నగేష్ వారి ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలు అనుసరించి ఈ కార్యక్రమం నిర్వహించారు.అలాగే కోవిడ్ కారణంగా ఉన్నతాధికారులు ఆదేశానుసారం ఆలయ కార్యాలయంలో పనివేళలు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే అని తెలియజేసారు. అలాగే 12 వ తేదీ బుధవారం జరగవలసిన బహిరంగ వేలం పాటలు వాయిదా వేయడమైనదని తదుపరి రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశములు వచ్చిన తరువాత మరలా తిరిగి బహిరంగ వేలం పాటలు నిర్వహించగలమని ఆలయ సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహకాధికారి బి.ఎల్.నగేష్ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసారు.

 1,506 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.