AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

స్టోన్ క్రషర్ నిర్మాణపనులు ఆపాల్సిందేసీపీఐ ఏఐవైఎఫ్ డిమాండ్డిప్యూటీ తహశీల్దార్ కు వినతి…

1 min read

AABNEWS : అనకాపల్లి మండలంలోని సుందరయ్యపేట గ్రామంలో ఆంద్రప్రదేశ్ అగ్రికల్చర్ ల్యాండ్ (కన్వర్షన్ ఫర్ నాన్ అగ్రికల్చర్ పర్పస్) యాక్ట్ 2006 అనుసరించి ఎటువంటి అనుమతి లేకుండా నిర్మాణం చేస్తున్న స్టోన్ క్రషర్ నిర్మాణ పనులను వెంటనే నిలుపుదల చేయాల్సిందేనని సీపీఐ, ఏఐ.వై.ఎఫ్. ల ప్రతినిధులు సోమవారం అధికారులను కోరారు. ఈ మేరకు అనకాపల్లి మండల డిప్యూటీ తహశీల్దార్ వెంకట్ కు గ్రామస్తుల సంతకాలుతో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐబి నాయకులు కోన లక్ష్మణ, ఏఐవైఎఫ్ నాయకులు వియ్యపు రాజు మాట్లాడుతూ సీతానగరం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 270లో శ్రీనివాస్ చౌదరి భారీస్టోన్ క్రషర్ నిర్మాణ పనులు చేస్తూన్నారు వీటికి ప్రజాభిప్రాయ సేకరణ కానీ, గ్రామసభ తీర్మానంలేదని ,రెవెన్యూ డివిజన్ అధికారి,(ఆర్డివో) అనుమతి కూడా లేవన్నారు ఈసర్వేనెంబర్ 270 గ్రామ 1బి ప్రకారం వ్యవసాయ భూమిగా నమోదైందిని ఈ భూమి సమీపంలో ఉన్న రైతులు భూములు వ్యవసాయం దెబ్బతిని రైతులు జీవనాధారమైన రాజు చెరువు కాలక్రమంలో దెబ్బతింటుందని దానిపై ఆధార పడిన ఆయకట్టు వలన రైతులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికి ఉన్న స్టోన్ క్రషర్ వల్ల మెండుపాలెం 22 మంది కిడ్నీ వ్యాధితో చనిపోయారని మరో 5 మంది కిడ్నీవ్యాధితో బాధపడుతున్నారని తక్షణమే అధికారులు స్పందించి స్టోన్ క్రషర్ నిర్మాణపనులు అపి విచారణ జరిపించి తగుచర్యలు తీసుకోని సాగు రైతులు పర్యావరణ ప్రమాదంలో పడకుండా చూడాలని, గ్రామస్తులు అభ్యంతరాలు లెక్కచేయకుండా చేసే నిర్మాణాలకు యాజమాన్యం, సంబందిత అధికారులు భాద్యతవహించ వలసి ఉంటుందని వారు తెలిపారు. ఈకార్యక్రమంలో డొక్కరి హరీష్, చొప్ప హరీష్ తదితరులుపాల్గొన్నారు

 430 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.