AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అనారోగ్యంతో మరణించిన సాంబయ్య కుటుంబానికి

1 min read

AAB NEWS : మానవ సేవే మాధవ సేవగా భావిస్తా. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నా ఉయ్యూరు కుటుంబ సభ్యులకు సేవ చేస్తూనే ఉంటాను – ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ ఉయ్యూరు మున్సిపాల్టీ 14 వార్డులో ఇటీవల అనారోగ్యంతో మరణించిన మేకల సాంబయ్య కుటుంబానికి రాజేంద్ర చారిటబుల్ ట్రస్ట్ మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో 10,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ సందర్బంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ నా ఉయ్యూరు ప్రజలకు సేవ చేస్తూ వారి ఋణం తీర్చుకుంటున్నానని,ఎందుకంటే 1995 లో నేను ఇండిపెండెంట్ సర్పంచ్ గా ఉయ్యూరు లో నామినేషన్ వేస్తే నేను మంచి చేస్తానని నమ్మి నన్ను పార్టీలకు అతీతంగా గెలిపించి, నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిన నా ఉయ్యూరు ప్రజలంటే నాకు ఎంతో అభిమానం అని రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు. అదే విధంగా గత 25 సం,, లుగా (సిల్వర్ జూబ్లీ) నేను వరుసగా పోటీ చేసిన అన్ని ఎన్నికల్లో ఓటమి అనేదే లేకుండా నన్ను నా ఉయ్యూరు ప్రజలు గెలిపించారని ఆ అభిమానం, ప్రేమ, వాత్సల్యం తోనే వారికి సేవ చేసుకుంటూ నా శేష జీవితం ఉయ్యూరు ప్రజలకు అంకితం చేస్తానని, పదవిలో వున్నా లేకపోయినా, అధికారంలో వున్నా లేకపోయిన నా ఉయ్యూరు ప్రజలకు సేవ చేసే విషయంలో రాజకీయాలు, కుల మతాలు, వర్గాలు చూడనని, నన్ను కూడా ఉయ్యూరు ప్రజలందరూ తమ సొంత బిడ్డవలె ఆదరిస్తారని, వాళ్ళు నన్ను అలా ఆదరించడం నా అదృష్టంగా భావిస్తానని రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు. ఈ కార్యక్రమం లో పొగిరి రాము,నడిమింటి పైడయ్య, మీసాల అప్పల నాయుడు, లంక అప్పలనాయుడు, జగరోతు లక్ష్మణ,అజ్మతుల్లా, శ్రీనివాస్, భాస్కర్,నజీర్, నరేష్,అంజి, శ్రీను, రాంబాబు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

 136 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.